మంత్రిమండలి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు కరువు భత్యం (డీఏ), కరువు భృతి (డీఆర్) మంజూరుకు కేబినెట్ ఆమోదం... 01.01.2026 నుంచి అమలు
प्रविष्टि तिथि:
18 APR 2026 3:13PM by PIB Hyderabad
ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు కరువు భత్యం (డీఏ), పెన్షనర్లకు అదనపు కరువు భృతి (డీఆర్) విడుదల చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాథమిక వేతనం, పెన్షన్‌పై ప్రస్తుతమున్న 58 శాతాన్ని, మరో 2 శాతానికి పెంచింది. ఈ పెంపు 01.01.2026 నుంచి అమల్లోకి వస్తుంది.
కరువు భత్యం, కరువు భృతి పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6,791.24 కోట్ల భారం పడుతుంది. ఈ పెంపు వల్ల సుమారు 50.46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68.27 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది.
7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఆమోదించిన ఫార్ములా ప్రకారం ఈ పెంపుదల ఉంది.
****
(रिलीज़ आईडी: 2253268)
आगंतुक पटल : 146
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam