ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్ డాక్టర్ క్రిస్టియన్ స్టాకర్ భారత పర్యటన: కుదిరిన ఒప్పందాలు

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2026 3:01PM by PIB Hyderabad

అవగాహన ఒప్పందాలుఒప్పందాలుఆసక్తి వ్యక్తీకరణ లేఖలు

క్ర.సం.

అవగాహన ఒప్పందఒప్పందం/ ఆసక్తి వ్యక్తీకరణ

వివరణ

1

భారత్ఆస్ట్రియా మధ్య ఆడియోవిజువల్ సహ నిర్మాణ ఒప్పందం

ఇరు దేశాల చలనచిత్ర పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించేలా వ్యవస్థాగత ఏర్పాటుతోపాటు.. ఉమ్మడి చలనచిత్ర నిర్మాణంసృజనాత్మకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి, విస్తృత సాంస్కృతిక భాగస్వామ్యం దిశగా ఈ ఒప్పందంతో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

2

భారత్, ఆస్ట్రియా కంపెనీల కోసం ఫాస్ట్ ట్రాక్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై ఉమ్మడి ప్రకటన

రెండు దేశాల్లోని పెట్టుబడిదారులు, కంపెనీలు పరస్పరం ఒక వ్యవస్థతో ఒకటి ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, పరిష్కరించడానికి ఈ వేగవంతమైన పరిష్కార యంత్రాంగం (ఫాస్ట్ ట్రాక్ మెకానిజం) కృషి చేస్తుంది. అంతేకాకుండా, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంపై పెట్టుబడిదారుల నుంచి వచ్చే సాధారణ సూచనలను చర్చించడానికి వేదికగా కూడా ఉపయోగపడుతుంది.

3

సైనిక వ్యవహారాల్లో సహకారంపై ఆసక్తి వ్యక్తీకరణ పత్రం

సైనిక వ్యవహారాల్లో సహకారంతోపాటు రక్షణ పారిశ్రామిక- సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఒక సంస్థాగత ఏర్పాటును ఈ ఆసక్తి వ్యక్తీకరణ లేఖ సూచిస్తుంది. 2026 జనవరి 27న కుదిరిన భారత్ – ఈయూ రక్షణ, భద్రత భాగస్వామ్య స్ఫూర్తితో ఇది ముందుకు సాగుతుంది. అలాగే రక్షణ విధానాలపై చర్చలు, శిక్షణ, సామర్థ్యాభివృద్ధికీ ఇది తోడ్పడుతుంది.

4

ఉగ్రవాద నిరోధక సంయుక్త కార్యవర్గంపై ఆసక్తి వ్యక్తీకరణ పత్రం

ఉగ్రవాద నిరోధక సంయుక్త కార్యవర్గం ఏర్పాటు దిశగా కలిసి పనిచేయాలన్న ఇరుపక్షాల లక్ష్యంతోపాటు, భారత్ - ఆస్ట్రియా మధ్య ఉగ్రవాద నిరోధక సహకారాన్ని ఇది ముందుకు తీసుకెళ్తుంది. ఉగ్రవాదంపై పోరాటానికి సంబంధించిన అంశాలపై వ్యూహాత్మక సహకారానికి గల అవకాశాలను ఇది పరిశీలిస్తుంది.

5

ఆస్ట్రియా ఏజీఈఎస్, భారత ఎఫ్ఎస్ఎస్ఏఐ మధ్య ఆహార భద్రతపై అవగాహన ఒప్పందం

ఆహార భద్రత ప్రమాణాలు, శాస్త్రీయ విధానాలను ఇచ్చిపుచ్చుకోవడం, సామర్థ్యాభివృద్ధి, ఆహార నియంత్రణలో అత్యుత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడం, రిస్కును అంచనా వేయడంలో సహకారాన్ని ఈ అవగాహన ఒప్పందం ప్రోత్సహిస్తుంది. తద్వారా వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూభద్రతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తుంది.

6

వృత్తి విద్య - శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, వృత్తిపరమైన అర్హతల గుర్తింపునకు సంబంధించి ఉమ్మడి ఆసక్తి వ్యక్తీకరణ పత్రం

వృత్తి విద్య - శిక్షణ (అప్రెంటీస్‌షిప్), నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఆదానప్రధానాలను మెరుగుపరచడం, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, అలాగే భారతీయ వృత్తి విద్యా అర్హతలను ఆస్ట్రియా ప్రమాణాలకు అనుగుణంగా గుర్తించేలా ప్రోత్సహించడంలో ఈ ఉమ్మడి ఆసక్తి వ్యక్తీకరణ పత్రం దోహదపడుతుంది.

 

ప్రకటనలు

క్ర.సం.

ప్రకటన

1

 

(రవాణా నిర్వహణలో అధునాతన వ్యవస్థలు, రహదారి భద్రత, టోల్ వసూలులో ఎలక్ట్రానిక్ పద్ధతులను అవలంబించడం, ట్రాఫిక్ నిర్వహణలో సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుంది)

2

భారత్ - ఆస్ట్రియా స్టార్టప్ వారధి ద్వారా అంకుర సంస్థల రంగంలో సానుకూల సహకారాన్ని మెరుగుపరచడం

(ఇరుదేశాల అంకుర సంస్థలు, యూనికార్న్ సంస్థలు, ఆవిష్కరణ వ్యవస్థలు, ప్రారంభ మూలధన సహకార/ వెంచర్ క్యాపిటల్ నెట్వర్కుల మధ్య నిరంతర సహకారం)

3

సంస్థాగత సైబర్‌ భద్రతా చర్చల ప్రారంభం.

4

భారతదేశపు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కేంద్రం – ఆస్ట్రియా సాయుధ దళాల అంతర్జాతీయ కేంద్రం (ఏయూటీఐఎన్‌టీమధ్య భాగస్వామ్యం.

5

2026 శరత్కాలంలో వియన్నాలో ద్వైపాక్షిక అంతరిక్ష పారిశ్రామిక సదస్సును సంయుక్తంగా నిర్వహించే ఒప్పందాన్ని సంయుక్త ప్రకటనలో చేర్చారు.

6

వర్కింగ్ హాలిడే ప్రోగ్రామ్ అమలు.

7

మెరుగైన భారత్ - ఆస్ట్రియా భాగస్వామ్యానికి కీలక ప్రాతిపదికగా అత్యున్నత సాంకేతిక సహకారం.

(సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో.. మెటీరియల్ సైన్స్ - టెక్నాలజీక్వాంటం టెక్నాలజీమురుగునీటి శుద్ధిమెషిన్ లెర్నింగ్లేజర్ల వంటి రంగాల్లో ఉమ్మడి పరిశోధన - అభివృద్ధి ప్రాజెక్టులను గుర్తించారు.)

8

విద్యలో సహకారంపై నిర్మాణాత్మక ద్వైపాక్షిక చర్చల ప్రారంభం

(నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరచడంపాఠ్యప్రణాళిక అభివృద్ధిని ప్రోత్సహించడంఅర్హతల పరస్పర గుర్తింపును సులభతరం చేయడంఉన్నత విద్యలో సంస్థాగత సహకారానికి తోడ్పాటునివ్వడం, వృత్తి విద్యా - శిక్షణా వ్యవస్థల అభివృద్ధికి తోడ్పడడం దీని లక్ష్యం.)

9

భారత్‌తో విద్య, పరిశోధనా సహకారాన్ని క్రమబద్ధంగా బలోపేతం చేయడం కోసం.. ఆస్ట్రియాలోని ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయాల ‘ఫోకస్ ఇండియా’ కార్యక్రమం

(ఆస్ట్రియాలోని మూడు ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయాలైన - టెక్నిస్చ్ యూనివర్సిటాట్ వియన్టెక్నిస్చ్ యూనివర్సిటాట్ గ్రాజ్, మోంటానునివర్సిటాట్ లియోబెన్ ఒక ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాయి. ఆస్ట్రియాలో ఇంజినీరింగ్, సాంకేతిక విద్యలో మాస్టర్స్ చదవాలనుకునే భారతీయ విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను సులభతరం చేయడం కోసం దీనిని రూపొందించారు.)

 

***


(రిలీజ్ ఐడి: 2252652) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Gujarati , Kannada , Malayalam