హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అండమాన్ - నికోబార్ దీవులు, గోవా, కర్ణాటక, లక్షద్వీప్, మిజోరాం, ఒడిషా, సిక్కిం, ఢిల్లీలోని ఎన్‌డిఎంసీ, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాల్లో గృహాల జాబితా, గృహగణన కోసం రేపటి నుంచి క్షేత్రస్థాయి కార్యకలాపాలు


ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో రేపటి నుంచి స్వీయ గణన ప్రారంభం

జనగణనలో తొలిసారిగా స్వీయ గణన సదుపాయం.. అనూహ్య స్పందన

2027 జనాభా లెక్కల కోసం అవలంబించిన డిజిటల్ విధానంలో భాగంగా.. ఇప్పటివరకు స్వీయ గణన సదుపాయాన్ని వినియోగించుకున్న దాదాపు 12 లక్షల కుటుంబాలు

స్వీయగణనను పూర్తిచేసిన వ్యక్తులు.. క్షేత్రస్థాయి సందర్శన సమయంలో గణన అధికారికి స్వీయ గణన ఐడీ వివరాలను అందించి గృహజాబితా ప్రక్రియను పూర్తిచేయాలి

బీహార్‌లో 15 రోజుల స్వీయ గణన ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం

జనగణన చట్టం - 1948 ప్రకారం డేటా సేకరణ.. అత్యంత గోప్యంగా నిర్వహణ: గణాంక పరిశీలనలు, అభివృద్ధి ప్రణాళిక కోసమే వినియోగం

ప్రకటించిన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు.. గృహాల జాబితా సమయంలో గణన అధికారులకు సహకరించాలి.. ముఖ్యమైన ఈ జాతీయ కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకోవాలి

నాడు పోస్టు చేయడమైనది: 15 APR 2026 7:05PM by PIB Hyderabad

దేశవ్యాప్త జనగణన ప్రక్రియలో భాగంగా.. 2027 జనాభాలెక్కల్లో మొదటి దశ అయిన ఇళ్ల జాబితాగృహ గణన (హెచ్ఎల్‌వో)కు సంబంధించి క్షేత్రస్థాయి కార్యకలాపాలు 2026 ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం కాబోతున్నాయి15 రోజుల స్వీయ గణన గడువు ముగిసిన అనంతరం.. అండమాన్ నికోబార్ దీవులుగోవాకర్ణాటకలక్షద్వీప్మిజోరాంఒడిషాసిక్కిం రాష్ట్రాలతోపాటు జాతీయ రాజధాని ప్రాంతంలోని ఎన్‌డీఎంసీఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాల్లో ఈ ప్రక్రియ మొదలవుతోంది2026 మే 15 వరకు.. 30 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో.. శిక్షణ పొందిన గణన అధికారులు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరిస్తారు.

జనగణనలో మొదటిసారి ప్రవేశపెట్టిన స్వీయ గణన సదుపాయానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది2027 జనాభా లెక్కల కోసం అవలంబిస్తున్న డిజిటల్ విధానంలో భాగంగా.. ఇప్పటివరకు దాదాపు 12 లక్షల కుటుంబాలు అధికారిక పోర్టల్ (se.census.gov.inద్వారా వివరాలను నమోదు చేసుకున్నాయి.

క్షేత్రస్థాయి గణన ప్రారంభానికి ముందే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందిదాంతో ప్రజలు తమ వివరాలను ఈ సురక్షితమైనసులభతరమైన డిజిటల్ వేదిక ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలను సమర్పించవచ్చుజనగణన కార్యకలాపాల డిజిటలీకరణలో ఈ కార్యక్రమం ఒక కీలక మైలురాయిగా నిలిచిందిపౌరులకు సౌలభ్యాన్నివెసులుబాటును అందించడంతోపాటు ఈ ప్రక్రియలో సులభంగా పాల్గొనే అవకాశాన్నిచ్చిన ఈ విధానానికి విశేష ప్రశంసలు లభించాయి.

స్వీయ గణన పూర్తి చేసిన ప్రజలు.. తమకు వచ్చిన స్వీయ గణన ఐడీ (ఎస్ఈఐడీ)ని సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం కోరుతోందిక్షేత్రస్థాయి సందర్శన సమయంలో గణన అధికారికి ఈ ఐడీ వివరాలను తెలియజేసి ప్రక్రియను పూర్తి చేయాలిస్వీయ గణన సదుపాయాన్ని వినియోగించుకోని ప్రజల వివరాలను.. గణాంక అధికారులు నేరుగా ఇంటింటికీ తిరిగి సేకరిస్తారు.

సమగ్రమైనకచ్చితమైన సమాచారం కోసం సంప్రదాయ పద్ధతిలో ఇంటింటికీ తిరిగి లెక్కించే పద్ధతిని కొనసాగిస్తూనే.. మొదటిసారిగా డిజిటల్ సాధనాలతో జనాభా లెక్కలను నిర్వహిస్తున్నారుక్షేత్రస్థాయి పర్యటనల సమయంలో ప్రత్యేకంగా రూపొందించిన ఒక మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి గణన అధికారులు డిజిటల్‌గా డేటాను సేకరిస్తారుదీనివల్ల సమాచారం మరింత కచ్చితంగా ఉండటమే కాకుండావిశ్లేషణ కూడా వేగవంతమవుతుంది.

ఇళ్ల జాబితాగృహగణన దశలో భాగంగా... గృహాల పరిస్థితికుటుంబ వివరాలుఅందుబాటులో ఉన్న వసతులుకుటుంబాల ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని గణన అధికారులు సేకరిస్తారుఇందుకోసం 33 ప్రశ్నలతో కూడిన ఒక నిర్మాణాత్మక ప్రశ్నావళిని ఉపయోగిస్తారుఆధారాలతో కూడిన ప్రణాళికా రచనకుసంక్షేమ అభివృద్ధి పథకాల రూపకల్పనకు జనగణనలోని ఈ దశ పునాదిగా నిలుస్తుంది.

జనగణన తదుపరి దశలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్అరుణాచల్ ప్రదేశ్హర్యానాచండీగఢ్మధ్యప్రదేశ్ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 2026 ఏప్రిల్ 16 నుంచి స్వీయ గణన సదుపాయం అందుబాటులోకి వస్తుందిఈ అవకాశం 2026 ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుందిఈ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి గృహాల జాబితా సేకరణ ప్రక్రియను 2026 మే నుంచి మే 30 వరకు నిర్వహిస్తారు.

మరోవైపు బీహార్‌లో 15 రోజుల స్వీయగణన ప్రక్రియ 2026 ఏప్రిల్ 17న ప్రారంభమై 2026 మే వరకు కొనసాగుతుందిఅనంతరం 2026 మే నుంచి మే 31 వరకు క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వహిస్తారు.

జనగణన చట్టం - 1948 ప్రకారం సేకరించిన ఈ సమాచారాన్ని అత్యంత గోప్యంగా నిర్వహిస్తారుగణాంకపరమైన పరిశీలనలుఅభివృద్ధి ప్రణాళికల రూపకల్పన కోసమే ఈ సమాచారాన్ని వినియోగిస్తారుప్రకటించిన రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు.. ఇళ్ల జాబితా కార్యకలపాల సమయంలో గణన అధికారులకు సహకరించాలనిఅత్యంత ముఖ్యమైన ఈ జాతీయ కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

***


(రిలీజ్ ఐడి: 2252377) సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Kannada