ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2026 9:36PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా తన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:

“పేదలు, అణగారిన వర్గాలు, పీడితులకు సమన్యాయం చేసేందుకు బాబాసాహెబ్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో ప్రతి పేదకూ, అణగారిన వ్యక్తికి వాస్తవిక సామాజిక న్యాయ ప్రదానంలో నిమగ్నమైంది.”

“దేశంలోని రోడ్లు, జాతీయ రహదారులు, ఎక్స్‌ ప్రెస్‌వేలు, విమాన మార్గాలు, రైల్వేలు, జలమార్గాలు తదితరాలన్నీ ప్రగతికి మూలస్తంభాలు. గడచిన దశాబ్దం నుంచీ వీటన్నిటినీ సాకారం చేయడానికి మా ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తోంది.”

“ఈ రోజు ప్రారంభించిన డెహ్రాడూన్-ఢిల్లీ ఆర్థిక కారిడార్ ఈ ప్రాంత రూపురేఖలను వినూత్నంగా మార్చనుంది. ఇది పూర్తయ్యాక ప్రయాణం చౌకగా, వేగంగా సాగడమే కాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక, వాణిజ్య రంగాలకూ ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.”

“దేశం నలుమూలల నుంచే కాకుండా యావత్‌ ప్రపంచ దేశాల నుంచి ఉత్తరాఖండ్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులకు, యాత్రికులందరికీ ఇది నా ప్రత్యేక వినతి...”

“దేవభూమి ఉత్తరాఖండ్ నుంచి నారీశక్తి వందన్ చట్ట సవరణకు మద్దతివ్వాలని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలనూ మరోసారి కోరుతున్నాను. తద్వారా దేశంలోని తల్లులు, అక్కచెల్లెళ్లు 2029 నాటికి తమ హక్కులు సద్వినియోగం చేసుకోవడాన్ని మనమంతా ప్రత్యక్షంగా చూస్తాం.”

“సాయుధ దళాల సామర్థ్య బలోపేతం లేదా సైనిక కుటుంబాల సౌకర్యం, ఆత్మగౌరవానికి భరోసా ఇవ్వడం వంటి అంశాల్లో మా ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2252046) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam