ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘నారీశక్తి వందన్ సమ్మేళన్’లో తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 13 APR 2026 10:35PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని  విజ్ఞాన భవన్లో ఈ రోజు జరిగిన ‘నారీశక్తి వందన్ సమ్మేళన్’ కార్యక్రమంలో తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. మహిళా నేతృత్వంలో అభివృద్ధి, సాధికారత పట్ల దేశానికున్న నిబద్ధతను ఆయన వివరించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి వరుస పోస్టుల్లో ఇలా రాశారు:

‘‘మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెల ఉత్సాహం, ఆత్మవిశ్వాసం న్యూఢిల్లీలో జరిగిన నారీశక్తి వందన్ సమ్మేళనానికి కొత్త శక్తిని అందించాయి.’’

‘‘2029 నుంచి నారీ శక్తి వందన్ అధీనియంను అమలు చేయడంలో విపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాం. దీనిపై ఏప్రిల్ 16న పార్లమెంటులో జరిగే చర్చను సంభాషణ, సహకారం, భాగస్వామ్యంతో ముందుకు సాగేలా చూసేందుకు మేం అన్ని విధాలా ప్రయత్నిస్తాం.

‘‘నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడు, వ్యవస్థలు కూడా మరింత బాధ్యతాయుతంగా మారతాయి. జల్ జీవన్ మిషన్‌తో సహా మేం అమలు చేస్తున్న అనేక పథకాల విజయమే దీనికి గొప్ప ఉదాహరణ.’’ 


‘‘క్షేత్రస్థాయి నుంచి వ్యక్తమయిన భావాలు వేదాలుగా  ఎలా మారతాయో.. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఓ పంచాయతీకి చెందిన మహిళా సభ్యులు అభివృద్ధికి సంబంధించి వ్యక్తం చేసిన అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి. ప్రతి పౌరుడూ దీని గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.’’


మా పథకాల ద్వారా మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలకు సాధికారత కల్పించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. దీనికి  అనేక ఉదాహరణలున్నాయి.


(రిలీజ్ ఐడి: 2251897) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Marathi , Manipuri , Kannada , English , हिन्दी , Gujarati