ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


అద్భుతమైన ఆమె సంగీత ప్రయాణాన్నీ, ఆమె ప్రతిభనీ కొనియాడిన పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 12 APR 2026 2:20PM by PIB Hyderabad

భారతదేశం గర్వించదగినప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణందేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయటమే కాకప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కదిలించిందని ప్రధానమంత్రి అన్నారుఆమె ఆలపించిన మధురగీతాల ద్వారాశక్తిమంతమైన స్వరకల్పనల ద్వారా ఆమె స్వరంలో ఎప్పుడూ అద్భుతమైన ప్రతిభ కనిపించేదని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారుఆమెతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు.

ఆమె కుటుంబసభ్యులకుఅభిమానులకుసంగీత ప్రియులకు ప్రధానమంత్రి సానుభూతిని తెలియజేశారురాబోయే తరాలకు ఆమె స్ఫూర్తినిస్తూనే ఉంటారనిఆమె పాడిన పాటలు ప్రజల జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రతిధ్వనిస్తాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"భారతదేశం గర్వించదగినప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణం... బాధాకరందశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణందేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయటమే కాకప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను కదిలించిందిఆమె ఆలపించిన మధురగీతాల ద్వారాశక్తిమంతమైన స్వరకల్పనల ద్వారా ఆమె స్వరంలో ఎప్పుడూ అద్భుతమైన ప్రతిభ కనిపించేదిఆమెతో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేను.

ఆమె కుటుంబసభ్యులకుఅభిమానులకుసంగీత ప్రియులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారాబోయే తరాలకు ఆమె స్ఫూర్తినిస్తూనే ఉంటారుఆమె పాడిన పాటలు ప్రజల జీవితాల్లో ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి"

 

***


(రిలీజ్ ఐడి: 2251309) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Kannada