ప్రధాన మంత్రి కార్యాలయం
మధుర పడవ ప్రమాద బాధితులకు నష్ట పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
10 APR 2026 11:00PM by PIB Hyderabad
మధురలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పీఎం జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ప్రమాదంలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబ సభ్యులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని అందజేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారికి కూడా రూ. 50,000 చొప్పున అందించనున్నట్లు తెలిపారు.
(రిలీజ్ ఐడి: 2251109)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8