ప్రధాన మంత్రి కార్యాలయం
చట్ట సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణావసరమని స్పష్టం చేసిన ప్రధానమంత్రి
మహిళలకు రిజర్వేషన్ బిల్లును తీసుకు రావడం వల్ల
భారతీయ ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతం, ప్రాతినిధ్య పూర్వకంగా తీర్చిదిద్దడంపై
ఒక వ్యాసాన్ని రాసి తన ఆలోచనలను ప్రజలతో పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
09 APR 2026 8:51AM by PIB Hyderabad
భారతీయ ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగానూ, ప్రాతినిధ్యపూర్వకంగానూ తీర్చిదిద్దడానికి చట్ట సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణావసరమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.
ఈ రిజర్వేషనును అమల్లోకి తీసుకు రావడంలో ఆలస్యం జరిగితే అది అత్యంత దురదృష్టకరమైందవుతుందని ప్రధాని అన్నారు. ఈ అంశంపై శ్రీ మోదీ తన ఆలోచనలనూ, దృష్టికోణాన్నీ ఇటీవల అచ్చయిన ఒక ఓప్-ఎడ్ వ్యాసంలో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణావసరం. ఇది మన ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగా, ప్రాతినిధ్యపూర్వకంగా తీర్చిదిద్దుతుంది. ఈ రిజర్వేషనును అమల్లోకి తీసుకు రావడంలో ఆలస్యం జరిగితే అది అత్యంత దురదృష్టకరమైందవుతుంది. ఈ అంశంపై నా ఆలోచనల్ని ఈ వ్యాసంలో పంచుకున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2250415)
आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam