రాజ్యసభ సచివాలయం
రాజ్యసభకు కొత్తగా/మళ్లీ ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్
నాడు పోస్టు చేయడమైనది:
06 APR 2026 2:48PM by PIB Hyderabad
కొత్తగా/మరోసారి ఎన్నికైన పంతొమ్మిది మంది సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్ శ్రీ సీపీ రాధాకృష్ణన్ రాజ్యసభ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ రాందాస్ బందు అథవాలే, శ్రీమతి మాయా చింతమన్ ఇవ్నతే, శ్రీ శరద్‌చంద్ర పవార్, శ్రీ రామ్‌రావు శఖారాం వద్కుటే, డాక్టర్ జ్యోతి నాగనాథ్ వాఘ్మర్, శ్రీ క్రిస్టోఫర్ మాణికం, డాక్టర్ అంబుమణి రాందాస్, శ్రీ కాన్స్టాండైన్ రవీంద్రన్, శ్రీ ఎల్ కే సుధీష్, డాక్టర్ ఎం తంబిదురై, శ్రీ తిరుచి శివ, శ్రీ బాబుల్ సుప్రియా బరాల్, డాక్టర్ మేనకా గురుస్వామి, శ్రీ రాజీవ్ కుమార్, రుక్మిణీ మల్లిక్, శ్రీ బిశ్వజిత్ సిన్హా, శ్రీ సంతృప్త్ మిశ్రా, శ్రీ దిలీప్ కుమార్ రే, శ్రీ మన్మోహన్ సమాల్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.
ముగ్గురు సభ్యులు మరాఠీలో, ఇద్దరు హిందీలో, ఆరుగురు తమిళంలో, ఒకరు ఇంగ్లీషులో, నలుగురు బెంగాలీలో, ముగ్గురు ఒడియాలో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో మహారాష్ట్ర నుంచి అయిదుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు, పశ్చిమ బెంగాల్ నుంచి అయిదుగురు, ఒడిశ్శా నుంచి ముగ్గురు ఉన్నారు.
పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు, గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జుయల్ ఓరం, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పీసీ మోదీ ఇతర సచివాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2249378)
సందర్శకుల సూచీ సంఖ్య : : 32