ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ నౌకా వాణిజ్య దినోత్సవం సందర్భంగా భారత నౌకా వాణిజ్య వారసత్వాన్ని గుర్తుచేసిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2026 2:29PM by PIB Hyderabad
జాతీయ నౌకా వాణిజ్య దినోత్సవం సందర్భంగా.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుసంపన్నమైన భారత నౌకా వాణిజ్య వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ రంగంతో అనుబంధం ఉన్న ఎంతోమంది అమూల్యమైన సేవలందించారని కొనియాడారు.
నౌకా వాణిజ్య రంగంలో అంకితభావంతో కూడిన వారి కృషి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, అనుసంధానాలు బలోపేతమయ్యాయని శ్రీ మోదీ అన్నారు.
దేశానికి సుసంపన్నమైన భవితను అందించడం లక్ష్యంగా.. నౌకా వాణిజ్య రంగంలోని అపారమైన సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి మరోసారి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“భారత నౌకా వాణిజ్య రంగ వారసత్వాన్నీ, ఈ రంగంతో అనుబంధమున్న వారి అమూల్యమైన సేవలనూ.. ఈ జాతీయ నౌకా వాణిజ్య దినోత్సవం సందర్భంగా మనం స్మరించుకుంటున్నాం. వారి అంకితభావం మన ఆర్థిక వ్యవస్థను, వాణిజ్యాన్ని, అనుసంధానాన్ని బలోపేతం చేశాయి.
సుసంపన్నమైన భవిష్యత్తే లక్ష్యంగా.. మన నౌకా వాణిజ్య రంగానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునే చర్యలను కొనసాగిస్తాం.”
***
(రిలీజ్ ఐడి: 2249206)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada