రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్, రత్లాం డివిజన్‌లో రూ.398.36 కోట్లతో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ ప్రాజెక్టుకు భారత రైల్వే ఆమోదం


డిజిటల్ అనుసంధానత పెంపుదల, కవచ్ అమలుకు మద్దతుగా ఈ ప్రాజెక్టు

పశ్చిమ రైల్వేలో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు 1929 ఆర్‌కెఎం ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థ.. అహ్మదాబాద్ డివిజన్‌లో 1456 ఆర్‌కెఎం, రత్లాం డివిజన్‌లో 473 ఆర్‌కెఎం

నాడు పోస్టు చేయడమైనది: 04 APR 2026 3:19PM by PIB Hyderabad

పశ్చిమ రైల్వే పరిధిలోని అహ్మదాబాద్రత్లాం డివిజన్లలో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు రూ. 398.36 కోట్ల అంచనా వ్యయంతో 4x48 ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ)ను ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయటానికి భారత రైల్వే కీలక ప్రాజెక్టును ఆమోదించింది.

"భారతీయ రైల్వేలోని మిగిలిన అన్ని మార్గాల్లో లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ (ఎల్‌టీఈకమ్యూనికేషన్ వ్యవస్థతో కవచ్ ఏర్పాటు (అంబ్రెల్లా వర్క్ 2024-25)” ద్వారా చేపట్టిన ఈ పనుల కోసం వర్క్స్ ప్రోగ్రామ్ 2024-25 (పీహెచ్‌-33) ద్వారా మొత్తం రూ. 27,693 కోట్ల నిధుల మంజూరుకు అనుమతి లభించిందిపశ్చిమ రైల్వే పరిధిలో పనుల కోసం రూ. 2,800 కోట్లతో ప్రత్యేక ఉపవిభాగాన్ని ఆమోదించగా.. ఈ ప్రాజెక్టు ఆ నిధులతోనే కొనసాగుతోంది.

పశ్చిమ రైల్వే పరిధిలో ఆమోదించిన పనుల్లో భాగంగా మొత్తం 1929 రూట్ కిలోమీటర్ల (ఆర్‌కేఎంమేర 2x48 ఫైబర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీవ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

  • అహ్మదాబాద్ డివిజన్‌లో 1456 ఆర్‌కేఎం

  • రత్లాం డివిజన్‌లో 473 ఆర్‌కేఎం

కమ్యూనికేషన్ వ్యవస్థలో చేసే ఈ భారీ మార్పులు రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్నివిశ్వాసాన్నిపనితీరుని మెరుగుపరుస్తాయిఇది కవచ్ వంటి ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలకు తోడ్పడటమే కాకవ్యవస్థ అంతటా సమాచారాన్ని వేగంగాఅంతరాయం లేకుండా పంపేందుకు సహకరిస్తుంది.

భారతీయ రైల్వేల ఆధునికీకరణభద్రత పెంపుదలడిజిటల్ పరివర్తన దిశగా ఈ కార్యక్రమం మరో ముందడుగుఇది రైల్వే కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచటమే కాకప్రయాణికులుసరకు రవాణాకు మెరుగైన సేవలను అందిస్తుంది.


(రిలీజ్ ఐడి: 2249026) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Kannada