ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పార్లమెంటులో జన్‌ విశ్వాస్‌ (నిబంధనల సవరణ) బిల్లు-2026 ఆమోదం పొందటం పట్ల ప్రధానమంత్రి హర్షం

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2026 10:59PM by PIB Hyderabad

పార్లమెంటులో జన్‌ విశ్వాస్‌ (నిబంధనల సవరణ) బిల్లు-2026 ఆమోదం పొందటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పౌరులను సాధికారత వైపు నడిపించటంలో, విశ్వాసంతో సాగే పాలనా వ్యవస్థను బలోపేతం చేయటంలో ఈ బిల్లు కీలక ముందడుగని పేర్కొన్నారు. పాతబడిన చట్టాలు, నిబంధనల తొలగింపుతో పాటు పలు ఉల్లంఘనలను నేరరహితం చేయటం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించేలా చేయటం, కోర్టులో కేసుల భారాన్ని తగ్గించటమే ఈ బిల్లు లక్ష్యం.

ఈ బిల్లు రూపకల్పనలో అనుసరించిన సంప్రదింపుల విధానాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బిల్లు ముసాయిదా ప్రక్రియలో విలువైన సూచనలు అందించిన వారిని, పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపిన వారందరినీ అభినందించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

" 'జీవన సౌలభ్యం’, 'సులభతర వ్యాపారానికి' భారీ ఊతం..

పార్లమెంటులో జన్‌ విశ్వాస్‌ (నిబంధనల సవరణ) బిల్లు-2026 ఆమోదం పొందటం హర్షించదగిన విషయం. పౌరులను సాధికారత వైపు నడిపించే, విశ్వాసంతో సాగే పాలనా వ్యవస్థను ఈ బిల్లు బలోపేతం చేస్తుంది. కాలం చెల్లిన నిబంధనలను తొలగించటం, చిన్నపాటి ఉల్లంఘనలను నేరరహితం చేయటం ద్వారా వేగవంతమైన కేసుల పరిష్కారంతో పాటు కోర్టులో కేసుల భారాన్ని తగ్గిస్తుంది.

ఈ బిల్లును రూపొందించటంలో అనుసరించిన సంప్రదింపుల విధానం అభినందనీయం.

ఈ బిల్లు రూపకల్పనలో అమూల్యమైన సూచనలను అందించిన వారికి, పార్లమెంటులో మద్దతు తెలిపిన వారికి అభినందనలు".

 

(రిలీజ్ ఐడి: 2248809) సందర్శకుల సూచీ సంఖ్య : : 85