హోం మంత్రిత్వ శాఖ
‘జన్ విశ్వాస్ బిల్లు 2026’ ఆమోదం పొందడంపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రశంసలు
జీవన సౌలభ్యాన్ని, వ్యాపార సౌలభ్యాన్ని వేగవంతం చేసే జన్ విశ్వాస్ బిల్లు
అనేక చట్టపరమైన నిబంధనలను తగ్గించడం ద్వారా.. ఇది మోదీ గారి నవ భారత దార్శనికతను ఒక గొప్ప వాస్తవంగా మలుస్తుంది
ఈ బిల్లు అందరికీ జీవితాన్ని సులభతరం, వ్యాపారాన్ని సరళతరం చేస్తుంది
प्रविष्टि तिथि:
03 APR 2026 10:18AM by PIB Hyderabad
పార్లమెంటులో ‘జన్ విశ్వాస్ బిల్లు 2026’ ఆమోదం పొందడంపై కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో.. ‘‘పార్లమెంటులో జన్ విశ్వాస్ బిల్లు 2026 ఆమోదం పొందడం అనేది జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యాన్ని వేగవంతం చేసే దిశగా భారత్ వేసిన ఒక గొప్ప ముందడుగు. అనేక చట్టపరమైన నిబంధనలను తగ్గించడం ద్వారా ఇది అందరి జీవితాలను సులభతరం చేయడమే కాకుండా వ్యాపార నిర్వహణను సరళతరం చేస్తుంది. తద్వారా శ్రీ మోదీ నవ భారత దార్శనికతను ఒక గొప్ప వాస్తవంగా మారుస్తుంది’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2248768)
आगंतुक पटल : 110