హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జనగణన - 2027: గృహాల జాబితా, గృహ జన గణన (హెచ్ఎల్‌వో)తో మొదలైన ప్రపంచంలో అతిపెద్ద జనగణన ప్రక్రియ


తొలిసారి డిజిటల్ పద్ధతిలో డేటా సేకరణ, స్వీయ నమోదు సదుపాయంతో 2027 జనాభా లెక్కల దేశవ్యాప్త ప్రక్రియ ప్రారంభం

దేశంలో స్వీయ నమోదును పూర్తిచేసిన తొలి వ్యక్తిగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

ఆన్‌లైన్‌లో స్వీయ నమోదును పూర్తిచేసిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా

ప్రజలు స్వీయ నమోదు ద్వారా కుటుంబ వివరాలను నమోదు చేసుకుని, జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరిన ప్రధాని

అండమాన్, నికోబార్ దీవులు, గోవా, కర్ణాటక, లక్షద్వీప్, మిజోరాం, ఒడిషా, సిక్కిం, ఢిల్లీలోని ఎన్డీఎంసీ, కంటోన్మెంటు బోర్డు ప్రాంతాల్లో స్వీయ గణన ప్రారంభం

తొలిరోజే సదుపాయాన్ని వినియోగించుకున్న దాదాపు 55,000 కుటుంబాలు

జనగణన చట్టం - 1948 ప్రకారం డేటా సేకరణ.. అత్యంత రహస్యంగా ఈ సమాచార నిర్వహణ

వచ్చే దశాబ్ద కాలానికి భారత అభివృద్ధి ప్రణాళికకు పునాది వేస్తూ.. పరిపాలనకు కీలక సాధనంగా నిలవనున్న జనగణన

నాడు పోస్టు చేయడమైనది: 01 APR 2026 8:45PM by PIB Hyderabad

ప్రపంచంలో అతిపెద్ద జనగణన ప్రక్రియ అయిన 2027 జనాభా లెక్కలు మొదలయ్యాయిఈ జనగణనలో మొదటి దశ అయిన గృహాల జాబితాగృహ గణన (హెచ్ఎల్‌వో)ను భారత ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభించిందిదీంతో దేశంలో అతిపెద్ద పరిపాలనగణాంక ప్రక్రియ ప్రారంభమైందిదేశంలో మొదటిసారి డిజిటల్ పద్ధతిలో డేటా సేకరణస్వీయ నమోదు ప్రక్రియ ఇది.

 

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము.. స్వీయగణన అవకాశాన్ని వినియోగించుకుంటూ వివరాలను నమోదు చేయడంతో దేశంలో జనగణన ప్రక్రియ ప్రారంభమైందిదేశ ప్రథమ పౌరులతో దేశంలో జనాభా లెక్కల ప్రక్రియను ప్రారంభించే సంప్రదాయాన్ని సగర్వంగా కొనసాగిస్తూ.. ఈ జనగణనకు శ్రీకారం చుట్టారు.

2027 జనాభా లెక్కల కోసం ఉపరాష్ట్రపతి భవన్‌ శ్రీ సి.పిరాధాకృష్ణన్.. ఉపరాష్ట్రపతి భవన్‌లో ఆన్లైన్‌లో స్వీయ గణన పత్రాన్ని పూరించారు.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేశారు. ప్రజలంతా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకుంటూ ఈ జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ షా కూడా స్వీయ గణన వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేశారుఈ జాతీయ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ప్రధానమైన అంశమని స్పష్టం చేశారు.

తొలి దశలో భాగంగా ఎనిమిది రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రోజు నుంచి స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైందిఅండమాన్ నికోబార్ దీవులుగోవాకర్ణాటకలక్షద్వీప్మిజోరాంఒడిషాసిక్కింతోపాటు దేశ రాజధానిలోని న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్ఎండీసీప్రాంతంఢిల్లీ కంటోన్మెంటు బోర్డులు ఈ జాబితాలో ఉన్నాయిఈ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 55,000 కుటుంబాలు తొలిరోజే ఈ స్వీయ నమోదు సౌకర్యాన్ని వినియోగించుకున్నాయిఈ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో గృహాల జాబితాగృహగణన 2026 ఏప్రిల్ 16న ప్రారంభమై, 2026 మే 15 వరకు కొనసాగుతుంది.

 

స్వీయ గణ నమోదు ప్రక్రియ 16 ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉన్న ఒక సురక్షితమైనవెబ్ ఆధారిత సదుపాయందీనిద్వారా గణకులు క్షేత్రస్థాయిలో సందర్శించడానికి ముందే.. పౌరులు తమకు అనుకూలమైన సమయంలో ఆన్‌లైన్‌లో వివరాలను అందించవచ్చుఈ అవకాశాన్ని తొలిసారిగా అందిస్తున్నారుగతంలో చేపట్టిన జనాభా లెక్కల మాదిరిగానే ఈ సారి కూడా గణకులు తమకు కేటాయించిన గృహ జాబితా బ్లాకులన్నింటిలోనూ ప్రతి ఇంటినీ సందర్శిస్తారుఅయితేస్వీయగణన అన్నది ఈసారి కల్పించిన అదనపు సౌకర్యంse.census.gov.in వెబ్‌సైటులో లాగిన్ అయ్యి.. మొబైల్ నంబరుప్రాథమిక వివరాలను ఉపయోగించి స్వీయగణన ప్రక్రియను పూర్తిచేయొచ్చువివరాలను సమర్పించిన అనంతరం ఒక ప్రత్యేక స్వీయ గణన ఐడీ (ఎస్ఈఐడీ)ని పొందుతారుఆ తర్వాత క్షేత్రస్థాయి సందర్శన సమయంలో.. నిర్ధారణ కోసం గణన అధికారికి ఆ ఐడీని అందించాల్సి ఉంటుంది.

 

గృహాల జాబితాగృహ గణన దశలో భాగంగా.. గృహాల స్థితిగతులువసతులుఆస్తుల వివరాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారుఈ కీలక సూచికలను నమోదు చేయడం కోసం మొదటి దశకుగాను మొత్తం 33 ప్రశ్నలను 2026 జనవరిలో ప్రకటించారుఆధారాల ప్రాతిపదికన ప్రణాళికా రచనవిధాన రూపకల్పనసంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు ఈ సమాచారమే పునాదిగా నిలుస్తుంది.

 

దేశవ్యాప్తంగా 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు 30 వరకు గృహాల జాబితాగృహ గణన (హెచ్ఎల్‌వోప్రక్రియను నిర్వహిస్తారుఈ ఆరు నెలల వ్యవధిలో ప్రతి రాష్ట్రమూకేంద్రపాలిత ప్రాంతాల్లో... ఆయా ప్రభుత్వాలు ప్రకటించిన మేరకు 30 రోజుల పాటు నిరంతర క్షేత్రస్థాయి కార్యకలాపాలను చేపట్టాలిఇంటింటి సర్వేకు సరిగ్గా ముందు.. స్వీయ గణన కోసం అదనంగా 15 రోజుల గడువునివ్వడం ఇదే మొదటిసారిగణన అధికారి సందర్శనకు ముందే ప్రజలు ఇళ్లలో నుంచే డిజిటల్‌గా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని ఈ సదుపాయం అందిస్తుంది.

 

వచ్చే దశాబ్ద కాలానికి సంబంధించి దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది వేస్తూ.. పరిపాలనలో అత్యంత కీలక సాధనంగా ఈ జనగణన నిలుస్తుందిజనగణన చట్టం - 1948 ప్రకారం సేకరించిన సమాచారాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతారు. 2027 జనాభా లెక్కల కోసం ఉపయోగిస్తున్న డిజిటల్ పరికరాలుసాంకేతికతను.. సమాచార భద్రతలో అత్యున్నత ప్రమాణాలను పాటించేలా బలమైన ఎన్‌క్రిప్షన్మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్లతో రూపొందించారుస్వీయ గణన ద్వారాగానీలేదా క్షేత్రస్థాయి సందర్శన సమయంలో జనాభా లెక్కల అధికారులకు పూర్తిగా సహకరించి వివరాలు అందజేయడం ద్వారాగానీ జనాభా లెక్కల ప్రక్రియలో ప్రజలు భాగస్వాములు కావాల్సిందిగా ప్రభుత్వం విన్నవిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2248097) సందర్శకుల సూచీ సంఖ్య : : 46
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada