ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియం


ప్రారంభోత్సవ సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 31 MAR 2026 4:48PM by PIB Hyderabad

భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న కోబా తీర్థ్‌లో సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయ్జైన వారసత్వ మ్యూజియం ప్రారంభోత్సవ విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంగ్రహంగా ప్రజలతో పంచుకున్నారు. ‘‘కోబా తీర్థ్ ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండి ఉందిఎందరో జైన మునులుసాధువుల తపస్సుకు ప్రతిరూపం ఈ ప్రదేశంసృజనసేవ ఇక్కడ సహజంగానే వికసిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

అధికారాన్ని సేవగాసాధనగా భావించి పనిచేయడానికి మన చరిత్ర నుంచి మనం స్ఫూర్తిని పొందుతాంఆ అమూల్యమైన వారసత్వాన్ని గాంధీనగర్‌లోని కోబా తీర్థలో ఉన్న సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయలో భద్రపరచి ప్రదర్శిస్తున్నారు.

యావత్ప్రపంచమూ అస్థిరతఅశాంతి అనే అగ్నిలో దహించుకుపోతున్న నేడు.. సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయ సందేశం భారతదేశానికి మాత్రమే కాదు.. సమస్త మానవాళికీ అత్యంత ముఖ్యమైనది.”

తాళపత్రాలుభూర్జ పత్రాలపై లిఖించిన వందల ఏళ్ల నాటి అరుదైన జ్ఞానాన్ని కోబా తీర్థ్‌లో భద్రపరచిసంకలనం చేశారుఈ కృషి మన గతాన్నివర్తమానాన్ని అనుసంధానించడమే కాకుండా.. మన భవిష్యత్తుకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఢిల్లీలో చరిత్రాత్మక నవకార్ మహామంత్ర దినోత్సవ కార్యక్రమంలో తొమ్మిది సంకల్పాల గురించి నేను మాట్లాడానునేడు మీరంతా ఈ పదో సంకల్పాన్ని వాటితో జోడించారు...’’  

 

***


(రిలీజ్ ఐడి: 2247350) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Kannada