ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 31 MAR 2026 10:34AM by PIB Hyderabad

భగవాన్ మహావీర్‌ జన్మ కల్యాణక్ (మహావీర్‌ జయంతి) పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భగవాన్ మహావీరుని జీవితం, ఆయన బోధనలు సత్యం, అహింస, కరుణ మార్గంలో నిరంతరం వెలుగులు నింపుతాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘‘ఆయన ఆదర్శాలు ఆధ్యాత్మికంగా ఉత్తేజాన్నివ్వడమే కాకుండా, నేటి ప్రపంచానికి ఎంతో సందర్భోచితంగా ఉన్నాయి. సమానత్వం, దయపై ఆయన చూపిన శ్రద్ధ, సమాజం పట్ల మనకు ఉన్న ఉమ్మడి బాధ్యతను గుర్తుచేస్తుంది’’ అని ప్రధానమంత్రి తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘భగవాన్ మహావీర్ జయంతి పవిత్ర సందర్భం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భగవాన్ మహావీరుని జీవితం, బోధనలు సత్యం, అహింస, కరుణ మార్గంలో నిరంతరం వెలుగులు నింపుతూనే ఉన్నాయి. ఆయన ఆదర్శాలు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనవి. నేటి ప్రపంచానికి కూడా ఎంతో అవసరమైనవి. సమానత్వం, దయపై ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, సమాజం పట్ల మనకున్న ఉమ్మడి బాధ్యతను గుర్తుచేస్తుంది’’.


(రిలీజ్ ఐడి: 2247235) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati