ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై రాజ్యసభలో చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 10:45PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై రాజ్యసభలో చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమంలో శ్రీ మోదీ చేసిన పోస్టుల్లో ఇలా పేర్కొన్నారు.
''చర్చలు, దౌత్యం ద్వారా పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించడమే భారతదేశ లక్ష్యం. దీని కోసం మేము అన్ని పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం ."
" ప్రతికూల పరిస్థితులు , దేశానికి నిరంతరాయంగా చమురు, గ్యాస్ సరఫరా అయ్యేలా చూసేందుకే మేం ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్న ఫలితాలను దేశం చూస్తోంది."
" రాబోయే సాగు సీజన్‌లో మన సోదరీసోదరులపై ఈ సంక్షోభ ప్రభావం పడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం."
" ప్రస్తుత సంక్షోభం 'టీమ్ ఇండియా'కు సైతం పెద్ద పరీక్షే! ఇందులో విజయం సాధించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు నాదొక ప్రత్యేక విన్నపం..."
" దేశ ప్రజల ప్రయోజనాలే మాకు అత్యంత ప్రాధాన్యాంశం. ఇదే మా గుర్తింపు, ఇదే మా శక్తి."
(రిలీజ్ ఐడి: 2245067)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5