ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేవి స్కందమాత దివ్య కృపను చాటి చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 MAR 2026 8:27AM by PIB Hyderabad

దేవి స్కందమాత దివ్యానుగ్రహాన్ని స్పష్టం చేస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుమాత దివ్య ఆశీస్సులతో అందరికీ శుభాలు కలగాలని ఆయన వేడుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘
దేవి స్కందమాతను ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తున్నాను.. మాత మమతాపూర్వక స్నేహఆశీర్వాద దృష్టితో  అందరినీ కటాక్షించు గాక.
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ
(ఈ  సంస్కృత పదాలకు.. సదా సింహంపై ఆసీనురాలై,  పద్మాల్ని రెండు చేతుల్లోనూ ధరించి ఉండే వైభవోపేత దేవి స్కందమాత మనకు నిరంతరం శుభ ఫలాల్ని ప్రసాదించాలని భావం)’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2243866) आगंतुक पटल : 57
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam