హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో సుదీర్ఘకాలం సేవలందించిన ప్రభుత్వాధినేతగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ: కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అభినందన


ప్రభుత్వాధినేతగా సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజుల రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ 8,931 రోజుల ప్రజా జీవితం.. ‘దేశమే ప్రథమం’గా పరిపాలనకూ, నిష్కళంకమైన కార్యాచరణకూ, అలుపెరుగని ప్రజాసేవకూ నిదర్శనం

పేదల హక్కులు, అభివృద్ధి, దేశ ప్రతిష్ఠ... గుర్తుపట్టలేనంతగా దేశ రూపురేఖలను మార్చేసిన మోదీ శకం

జీవితకాలపు కృషితో నవభారత నిర్మాణం... జీవితాన్ని ధారబోసిన ప్రధాని శ్రీ మోదీ

సెలవు తీసుకోకుండా 24 ఏళ్లకు పైగా దేశానికీ, ప్రజలకూ సేవలందించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం

ప్రజల్లో ఆయనపట్ల రోజురోజుకూ పెరుగుతున్న నమ్మకం, ఆత్మీయత, మద్దతు

నాడు పోస్టు చేయడమైనది: 22 MAR 2026 3:14PM by PIB Hyderabad

దేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిచారని కేంద్ర హోంసహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారుసిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును అధిగమించి శ్రీ మోదీ ఈ అరుదైన ప్రస్థానాన్ని చేరుకున్నారని వెల్లడించారుసేవకఠోర శ్రమఅచంచలమైన నిబద్ధత వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని శ్రీ అమిత్ షా ప్రశంసించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు:- ‘‘సేవకఠోర శ్రమఅచంచలమైన నిబద్ధతలే ప్రాతిపదికగా ఆయన ఈ విజయాన్ని సాధించారుసిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును అధిగమించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ఈ రోజుతో దేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా సేవలందించిన వ్యక్తిగా నిలిచారుమొదట గుజరాత్ ముఖ్యమంత్రిగాఇప్పుడు ప్రధానమంత్రిగా శ్రీ మోదీ ప్రజా జీవితంలో గడిపిన 8,931 రోజులు.. ‘దేశమే ప్రథమం’ అనే పరిపాలన విధానానికీనిష్కళంకమైన పనితీరుకూప్రతి పౌరుడి పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన సేవా నిరతికీ నిదర్శనంఅపూర్వ విశ్వాసమూఅద్వితీయమైన సేవాభావాలే పునాదులుగా వెలసిన అసాధారణ పరంపర ఇది.’’

 

దశాబ్దాలుగా అలుపెరుగని సేవలందిస్తున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ ఓ కొత్త శకానికి నాంది పలికారుపేదలకు హక్కులను అందించడంఅభివృద్ధిలో సరికొత్త విజాయాలను నెలకొల్పడం లేదా అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయడం... ఇలా ప్రతి అంశంలోనూ మోదీ శకంలో దేశ రూపురేఖలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయిఈ నవ భారతాన్ని తీర్చిదిద్దేందుకు ఒక జీవితకాలపు కఠోర శ్రమ అవసరంప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన జీవితాన్ని ఇందుకోసం అంకితం చేశారు. 24 సంవత్సరాలకు పైగా సెలవు తీసుకోకుండా దేశానికీప్రజలకు సేవలందించడం ఆయన అంకితభావానికి నిదర్శనంమూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగామూడుసార్లు భారత ప్రధానమంత్రిగా ఎన్నికవడం.. ఆయనపట్ల ప్రజలకున్న అపూర్వ ఆదరాభిమానాలకు నిదర్శనంఆయనపై ప్రజలకున్న నమ్మకంఆత్మీయతవారి మద్దతు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి” అని శ్రీ అమిత్ షా అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2243628) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati