ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 MAR 2026 9:09AM by PIB Hyderabad

బీహార్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

బీహార్ రాష్ట్రం భారతీయ వారసత్వానికి ఎంతో కాలంగా వైభవందివ్యత్వాన్ని ప్రసాదిస్తోందని పేర్కొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.. ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారుప్రస్తుతం బీహార్ ప్రతిరోజూ ప్రగతిలో సరికొత్త అధ్యాయాలను లిఖిస్తోందని ఆయన చెప్పారుకష్టపడి పనిచేసే తత్వంశక్తిసామర్థ్యాలు కలిగిన బీహార్ ప్రజల అంకితభావం.. 'వికసిత భారత్'తో పాటు 'వికసిత బీహార్సంకల్పాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్న గట్టి నమ్మకాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:

బీహార్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలుభారతీయ వారసత్వానికి భవ్యతదివ్యత్వాన్ని ప్రసాదించిన మన ఈ రాష్ట్రం.. నేడు ప్రగతి పథంలో అనునిత్యం సరికొత్త అధ్యాయాలను లిఖిస్తోందికష్టపడి పనిచేసే తత్వంఅపార శక్తిసామర్థ్యాలు కలిగిన ఇక్కడి ప్రజల అంకితభావం.. 'వికసిత భారత్'తో పాటు 'వికసిత బీహార్సంకల్పాన్ని సాకారం చేయడంలో ఎంతగానో తోడ్పడుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను."

 

***


(రిలీజ్ ఐడి: 2243568) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Gujarati , Kannada