ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంబ మాత పట్ల భక్తితో నిండిన దివ్య వాతావరణం, నవరాత్రి ఆధ్యాత్మిక సారం.. వీటిని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 MAR 2026 9:48AM by PIB Hyderabad

 

నవరాత్రుల ఆధ్యాత్మిక వాతావరణానికి సంబంధించిన  తన అభిప్రాయాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. అంబ మాత పట్ల భక్తి ప్రపత్తులు మదిని అనంత శాంతితో, ఉత్సాహంతో నింపేసే తీరును ఆయన ప్రస్తావించారు. అంబ మాతను స్తుతిస్తున్న ఒక భక్తి గీతాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘నవరాత్రిలో వాతావరణం అంబా మాత పట్ల భక్తితో తడిసిపోయి మనస్సును అనంత శాంతితోనూ, ఉత్సాహంతోనూ నింపేస్తుంది. మాతకు సమర్పితమైన శ్రద్ధ, విశ్వాసాల ప్రతిధ్వనులు హృదయాన్ని స్పందింపచేస్తాయి’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2242839) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Kannada