ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలోని పాలంలో అగ్ని ప్రమాదం.. ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2026 2:45PM by PIB Hyderabad
పాలంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఢిల్లీలోని పాలంలో జరిగిన అగ్నిప్రమాదంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. ఈ దుర్ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున సహాయం అందిస్తామని ప్రధాని శ్రీ మోదీ ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ఢిల్లీలోని పాలంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తున్నాం: ప్రధానమంత్రి’’
***
(రిలీజ్ ఐడి: 2241932)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada