హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రక్షణ శాఖ మాజీ మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వర్ధంతి.. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు


జాతీయవాది, వినయ శీలి పారికర్ గారి జీవితం, దేశానికి ఆయన చేసిన సేవలూ సదా స్మరణీయాలు

ప్రజానేతగా ఆయన వారసత్వం తర తరాలకూ స్ఫూర్తిదాయకం

प्रविष्टि तिथि: 17 MAR 2026 12:54PM by PIB Hyderabad

కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ‘‘మనోహర్ పారికర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. గొప్ప జాతీయవాది, వినమ్ర స్వభావం కలిగిన పారీకర్ గారి జీవితం, దేశ ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజానేతగా ఆయన అందించిన వారసత్వం తర తరాల వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2241100) आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Kannada