ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 14 MAR 2026 4:46PM by PIB Hyderabad

గవర్నర్ ఆర్ ఎన్ రవి గారుకేంద్ర మంత్రివర్గంలో  నా సహచరులు శంతను ఠాకూర్ గారుసుకాంత మజుందార్ గారుపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు సువేందు అధికారి గారునా తోటి పార్లమెంటు సభ్యులు శమిక్ భట్టాచార్య గారుఇతర ప్రజా ప్రతినిధులుసోదరీ సోదరులారా!

నేడు కోల్‌కతా గడ్డపై నుంచి పశ్చిమ బెంగాల్తూర్పు భారతదేశ అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం లిఖించబోతుంది. సుమారు 18 వేల కోట్ల రూపాయలకుపైగా విలువైనన రహదారిరైల్వేఓడరేవు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు జరిగాయి. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్తూర్పు భారతదేశానికి కొత్త ఊపునిస్తాయి. వాణిజ్యంపరిశ్రమలను ప్రోత్సహిస్తాయి. లక్షలాది మంది జీవితాలను సులభతరం చేస్తాయి. వారికి కొత్త అవకాశాలను అందిస్తాయి. ఖరగ్‌పూర్-మోరెగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి కావడంతో పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయి. దుబ్రాజ్‌పూర్ బైపాస్కంగ్‌షవతిశిలావతి నదులపై నిర్మిస్తున్న పెద్ద వంతెనలు అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ ప్రాజెక్టుల సందర్భంగా పశ్చిమ బెంగాల్తూర్పు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

నేడు దేశంలో రైల్వేలను ఆధునీకరించేందుకు వేగవంతమైన ఉద్యమం జరుగుతోంది. ఇందులో పశ్చిమ బెంగాల్ వెనుకబడకూడదన్నదే మా సంకల్పం. అందుకే పశ్చిమ బెంగాల్ రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన ప్రయత్నాలు చేస్తోంది. నేడు కలైకుండకనిమహులి విభాగాల్లో స్వయంచాలక బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను దేశానికి అంకితం చేశాం. ఇది రద్దీగా ఉండే రైలు మార్గాల సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రయాణాన్ని మరింత సురక్షితం చేస్తుంది. ప్రయాణీకులకు వేగంసౌకర్యం కూడా మెరుగుపడేలా చేస్తుంది.

మిత్రులారా,

నేడు కామాఖ్యగుడిఅనారాతమ్లుక్హల్దియాబరాభుమ్సియూరి అనే ఆరు స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా ప్రారంభించాం. ఈ స్టేషన్‌లలో బెంగాల్ సంస్కృతి ఇప్పుడు మరింత ప్రకాశిస్తోంది. ఇక్కడ ఇంకా మరెన్నో స్టేషన్లను కూడా పునరాభివృద్ధి చేస్తున్నాం. పురూలియాఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును కూడా ప్రారంభించాం. ఈ రైలు సర్వీసు కేవలం పశ్చిమ బెంగాల్ ప్రజలకే కాకుండా జార్ఖండ్బిహార్ఉత్తరప్రదేశ్ఢిల్లీ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

మిత్రులారా,

రహదారిరైలు అనుసంధానతలు ఎంత ముఖ్యమో ఓడరేవులుజల రవాణాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయి. దశాబ్దాలుగా ఈ విషయంలో తూర్పు భారతదేశం సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. కానీ నేడు జలమార్గాలు వాణిజ్యంపారిశ్రామిక పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తున్నాయి. ఈ దిశగా నేడు ముఖ్యమైన ఓడరేవు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు జరిగాయి. కోల్‌కతాహల్దియా వంటి ఓడరేవులు తూర్పు భారతదేశంలో చాలా కాలంగా ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా ఉన్నాయి. హల్దియా డాక్ కాంప్లెక్స్‌ను యాంత్రీకరిస్తున్నాం. ఇది సరుకు రవాణా కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది. ఓడరేవు సామర్థ్యాన్ని పెంచుతుంది. వాణిజ్యానికి కొత్త సౌకర్యాలను కల్పిస్తుంది. కోల్‌కతా డాక్ సిస్టమ్‌లో బాస్కుల్ వంతెన పునరుద్ధరణ పనులు కూడా జరుగుతున్నాయి. కిడ్డర్‌పూర్ డాక్ వద్ద సరుకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంపై కూడా మేం దృష్టి సారిస్తున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ తూర్పు ప్రాంతంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2240432) సందర్శకుల సూచీ సంఖ్య : : 33
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Tamil , Kannada , Malayalam