సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ అమలు చేసిన డీసీఎఫ్‌డీసీ పథకం ద్వారా చలనచిత్రాలు, సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నాలను విస్తరిస్తున్న భారత్
నాడు పోస్టు చేయడమైనది:
11 MAR 2026 2:42PM by PIB Hyderabad
జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ)కి నిధులను సమాచార, ప్రసార శాఖ ‘డీసీఎఫ్‌డీసీ (డెవలప్మెంట్, కమ్యూనికేషన్, డిసెమినేషన్ ఆఫ్ ఫిల్మిక్ కంటెంట్) పథకం’లో భాగంగా కేటాయిస్తున్నది.
ఫిల్మ్ కంటెంటును రూపొందించడాన్నీ, నవకల్పనలనీ, ప్రచారం చేయడాన్నీ ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. దీనిలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై భారతీయ చలనచిత్రాలను ప్రోత్సహించడం కోసం చలనచిత్రోత్సవాల్ని ఏర్పాటు చేయడం, వాటిలో పాల్గొనడంతో పాటు భారతీయ చలనచిత్రాల వ్యాప్తిని విస్తరింప చేయడానికి చలనచిత్ర రూపకర్తలకూ, చలనచిత్రాలతో సంబంధం గల సంస్థలకూ ఆర్థిక సహాయాన్ని అందించడం కూడా భాగమే. ఇది భారత చలనచిత్ర వారసత్వాన్ని సంరక్షించడం, పునరుద్ధరించడం, డిజిటల్ మాధ్యమంలోకి మార్చడం, భద్రపరిచే ప్రక్రియలకు మద్దతివ్వడంతో పాటు భారత్లో అంతర్జాతీయ చలనచిత్రాల ఆడియో-విజువల్ సహ నిర్మాణాన్నీ, చిత్రీకరణనీ ప్రోత్సహిస్తోంది.
మంత్రిత్వ శాఖ.. డీసీడీఎఫ్‌సీ పథకం ద్వారా చలనచిత్రోత్సవాలు, కార్యశాలలు, ప్రదర్శనలు, మాస్టర్క్లాసులతో పాటు ప్రచార కార్యకలాపాలను నిర్వహిస్తూ గాని లేదా మద్దతిస్తూ గాని చలనచిత్ర నిర్మాతలకూ, ఇతర సృజనాత్మక వృత్తినిపుణులకూ సహాయ పడుతుంది. ఇది చలనచిత్ర రంగం అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించడమే కాక చలనచిత్ర రూపకర్తలు, కళాకారులు, సాంకేతిక నిపుణులు తదితర చిత్ర పరిశ్రమ వృత్తినిపుణుల మధ్య చర్చలకు మార్గాన్ని సుగమం చేస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి https://www.nfdcindia.com నీ, https://mib.gov.in/en/offerings/schemes-monitoring నీ చూడవచ్చు.
డీసీడీఎఫ్‌సీ పథకంలో భాగంగా నిధుల వినియోగం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
|
క్రమ సంఖ్య
|
ఆర్థిక సంవత్సరం
|
ఎన్ఎఫ్‌డీసీకి కేటాయించిన,
పంపిణీ చేసిన నిధులు
(రూ. కోట్లలో)
|
ఎన్ఎఫ్‌డీసీ వినియోగించిన నిధులు
(రూ. కోట్లలో)
|
|
1
|
2021-22
|
84.50
|
77.69
|
|
2
|
2022-23
|
127.00
|
122.78
|
|
3.
|
2023-24
|
348.12
|
339.89
|
|
4.
|
2024-25
|
340.68
|
324.21
|
|
5
|
2025-26*
|
232.46
|
156.86
|
* ఫిబ్రవరి 26 వరకు.
చలనచిత్రాలు, సంబంధిత కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు ఏటా గోవాలో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని (ఐఎఫ్ఎఫ్ఐ.. ‘ఇఫీ’)ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యాన్ని సమాచార, ప్రసార శాఖ ఎన్ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో ఏర్పరుచుకుంటున్నది.
దీనికి అదనంగా, 2025 నుంచి ముంబయిలో ‘వేవ్స్’ (ప్రపంచ శ్రవణ, దృశ్య, వినోద శిఖరాగ్ర సదస్సు)ను విజయవంతంగా నిర్వహించారు. అలాగే, మహారాష్ట్ర చలనచిత్ర, రంగస్థల, సాంస్కృతిక అభివృద్ధి సంస్థ (ఎంఎఫ్ఎస్సీడీసీఎల్) సహకారంతో మహారాష్ట్రలోని ఫిల్మ్ సిటీలో రెసిడెన్షియల్ రైటర్స్ ల్యాబును నిర్వహించారు. ఆయా సంవత్సరాల వారీగా ప్రముఖ కార్యక్రమాలు, స్క్రీనింగులు, షోలు, ప్రతినిధులు, పాల్గొన్నవారి వివరాలు కింద ప్రస్తావించిన విధంగా ఉన్నాయి:
|
సంవత్సరం
|
కార్యక్రమం
|
స్క్రీనింగులు,
షోల సంఖ్య
|
ప్రతినిధులు,
పాల్గొనే వారు సుమారుగా
|
|
2025
|
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)
|
380
|
17,999
|
|
2025
|
ప్రపంచ శ్రవణ, దృశ్య, వినోద శిఖరాగ్ర సదస్సు (‘వేవ్స్’)
|
-
|
1,00,000 +
|
|
2024
|
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)
|
435
|
15,384
|
|
2024
|
ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్)
|
314
|
12,027
|
|
2023
|
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)
|
318
|
13,902
|
|
2022
|
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)
|
293
|
12,431
|
|
2022
|
ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్)
|
119
|
8,898
|
|
2021
|
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)
|
236
|
8,888
|
ఈ కార్యక్రమాల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు.
ఈ సమాచారాన్ని సమాచార, ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్‌సభలో శ్రీ జి. కుమార్ నాయక్ కు ఈ రోజు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2238443)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8