వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణ రైతులకు భారీ బహుమతి ప్రకటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్


తెలంగాణలో రూ. 894 కోట్ల విలువైన పంట దిగుబడిని

కనీస మద్దతు ధరతో సేకరించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 5:16PM by PIB Hyderabad

రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026 రబీ సీజన్‌కు గాను తెలంగాణలో మొత్తం 1,25,855 మెట్రిక్ టన్నుల పంటను కనీస మద్దతు ధర వద్ద సేకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు.

ఈ పంటల సేకరణను ధర మద్దతు పథకం (పీఎస్ఎస్ప్రైజ్ సపోర్ట్ స్కీమ్కింద చేపట్టనున్నారుఇందులో భాగంగా 29,860 మెట్రిక్ టన్నుల శనగలు.. 37,020 మెట్రిక్ టన్నుల మినుములు.. 55,285 మెట్రిక్ టన్నుల వేరుశనగ.. 3,690 మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు కొనుగోలు చేయనున్నారుకేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదించిన ఈ సేకరణ మొత్తం విలువ 894 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది.

రైతులను మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షించి వారి కష్టానికి తగిన పూర్తి ధర లభించేలా చూడటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారుఈ ఆమోదం వల్ల తెలంగాణ రైతులు పంటకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా పప్పుధాన్యాలునూనెగింజల ఉత్పత్తికి కొత్త ఉత్తేజం లభిస్తుందని ఆయన పేర్కొన్నారుదేశంలోని ప్రతి రైతు చేసిన కష్టానికి తగిన గౌరవంవిలువ దక్కాలన్నదే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో రైతుల ఆదాయాన్ని పెంచడంవ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటంగ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారుఈ నిర్ణయం వల్ల రైతులు ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదని.. తద్వారా వారికి అటు ఊరట ఇటు ఆర్థిక భద్రత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో శనగలుమినుములువేరుశనగపొద్దుతిరుగుడు పంటలను సాగు చేసే రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందిఇది రాష్ట్ర వ్యవసాయ రంగంలో స్థిరత్వంభద్రతసమృద్ధికి ఒక కొత్త దిశను నిర్దేశిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2238439) సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Gujarati , Tamil