ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ ప్రగతి, దేశ శ్రేయస్సు కోసం సామూహిక శక్తీ, సంకల్పమూ ముఖ్యమని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 9:31AM by PIB Hyderabad

దేశ ప్రగతిదేశ శ్రేయస్సు కోసం సామూహిక శక్తితో పాటు సంకల్పం ముఖ్యమని స్పష్టం చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా పంచుకున్నారు:

‘‘స్వస్తి పన్థామనుచరేమ సూర్యాచన్ద్రమసావివ

పునర్దదాతాఘ్నతా జానతా సంగమేమహి’’.

భారత ప్రజల అపరిమిత శక్తే దేశాభివృద్ధికి మూలమని ప్రధాని అన్నారుమన సామర్థ్యాలుమన పరస్పర విశ్వాసాలను ఊతంగా తీసుకొని ప్రతి ఒక్క సంకల్పాన్నీ నెరవేర్చాం.. భవిష్యత్తులోనూ ఇలాగే నెరవేరుస్తూ ఉంటామని ఆయన అన్నారు.

సూర్యచంద్రుల మాదిరిగా మనం కూడా శుభ మార్గంలో నిరంతరం ముందుకు సాగుతూ ఉండాలిరండిపరస్పర సద్భావనఅహింసజ్ఞానం.. వీటిని తోడుగా తీసుకొనిముందుకు సాగుదాంప్రగతినీశ్రేయస్సునీ సాధించే దిశగా పయనించడంలో ఒకరికి మరొకరం సహకరించుకుందామనే సందేశాన్ని ఈ సుభాషితం అందిస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘ భారత ప్రజల అపరిమిత శక్తే దేశాభివృద్ధికి కీలకంమన సామర్థ్యంతోపరస్పర విశ్వాసంతో ప్రతి సంకల్పాన్నీ సాకారం చేసుకుంటూ వచ్చాం.. ఇక ముందు కూడా ఇలాగే చేస్తూ ఉందాం.

‘‘స్వస్తి పన్థామనుచరేమ సూర్యాచన్ద్రమసావివ

పునర్దదాతాఘ్నతా జానతా సంగమేమహి’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2238097) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam