పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కాన్పూర్‌లో అంతర్జాతీయ సరీసృపాల అక్రమ రవాణా ముఠా సూత్రధారిని అరెస్టు చేసిన ఎంపీ ఎస్టీఎస్ఎఫ్, డబ్ల్యూసీసీబీ

నాడు పోస్టు చేయడమైనది: 09 MAR 2026 11:08AM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సరీసృపాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా సూత్రధారి తారక్ నాథ్ ఘోష్‌ను వైల్డ్‌లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ), మధ్యప్రదేశ్ స్టేట్ టైగర్ స్ట్రయిక్ ఫోర్స్ (ఎంపీ ఎస్టీఎస్ఎఫ్అరెస్టు చేశాయి.

తాబేళ్లుకుండ మూతి మొసళ్ల అంతర్జాతీయ అక్రమ రవాణాకు సంబంధించి మధ్యప్రదేశ్‌లో నమోదైన మూడు కేసుల్లో నిందితుడైన ఈ వ్యక్తిగత ఎనిమిదేళ్లుగా పరారీలో ఉన్నాడుమూడు వేర్వేరు కోర్టులు అతడిని అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశాయి.

ఉత్తరప్రదేశ్మధ్యప్రదేశ్ఆంధ్రప్రదేశ్బీహార్ఒడిశాతమిళనాడుకర్ణాటకపశ్చిమ బెంగాల్ సహా వివిధ రాష్ట్రాలకు అతడి వ్యాపారం విస్తరించిందిబంగ్లాదేశ్థాయ్‌లాండ్మయన్మార్సింగపూర్ సహా విదేశాల్లోనూ అతడి వ్యవస్థ విస్తరించినట్లుగా అనుమానిస్తున్నారు.

వ్యవస్థీకృతమైన అక్రమ వన్యప్రాణుల రవాణా ముఠాకు ఘోష్ అరెస్టు పెద్ద దెబ్బమార్చి 9న (సోమవారంశివపురి (మధ్యప్రదేశ్ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారుఅతనితో సంబంధం ఉన్న ముఠా గురించిన సమాచారాన్ని సేకరించేందుకు అతడిని కస్టడీకి అప్పగించాల్సిందిగా అటవీశాఖ లేదా పోలీసులు కోరే అవకాశం ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2236950) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Tamil