ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 08 MAR 2026 3:54PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనాకేంద్ర మంత్రివర్గ సహచరులు మనోహర్ లాల్హర్ష్ మల్హోత్రాతోఖన్ సాహురాష్ట్ర ప్రభుత్వ మంత్రులందరికీగౌరవ పార్లమెంటు సభ్యులకుశాసనసభ్యులకునా ప్రియమైన ఢిల్లీ సోదరీసోదరులకు నమస్కారం.

అభివృద్ధికి కొత్త వేగం ఇచ్చేందుకు మనమందరం నేడు ఇక్కడ ఢిల్లీలో సమావేశమయ్యాంకాసేపటి క్రితమేముప్పై మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు జరిగాయిమెట్రో విస్తరణ మొదలుకొని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గృహనిర్మాణం వరకు రాజధానిలోని సౌకర్యాలు నిరంతరం బలోపేతం అవుతున్నాయిఇది నగరానికి కొత్త శక్తిని ఇస్తోందిఏడాది క్రితం ఢిల్లీ ప్రజలైన మీరు ఏ నమ్మకంతోఆశతో ఇక్కడ బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారోఆ సంకల్పం ఇప్పుడు ఈ అభివృద్ధి పనుల్లో కనిపిస్తోందిఈ నిరంతర ప్రగతి సందర్భంగా ఢిల్లీ పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

నేటి కార్యక్రమం మరో కారణం చేత కూడా ప్రత్యేకంఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంభారత్ నేడు మహిళా సాధికారతకు సంబంధించి కొత్త చరిత్ర రాస్తోందిరేఖా గుప్తా విజయవంతమైన నాయకత్వంలో రాజధాని నగరం ముందుకు సాగుతోందిరాజకీయాలుపరిపాలనసైన్స్క్రీడలు లేదా సామాజిక సేవ ఇలా ప్రతి రంగంలోనూ భారత మహిళా శక్తి కొత్త ఉత్సాహంతో దూసుకుపోతోందిమహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళా శక్తికి నా హృదయపూర్వక అభినందనలు.  దేశ అభివృద్ధిలో వారి అపారమైన కృషిని గుర్తించడమే కాకుండాసమాజాన్నిదేశాన్ని వారు మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నానుదేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు వారు కొత్త శక్తిని అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ వారికి అనేకానేక శుభాకాంక్షలు.  

మిత్రులారా,

ప్రపంచంలో ఎవరైనా భారత్ వంటి భారతదేశం లాంటి విశాలమైన ప్రజాస్వామ్య దేశం గురించి ఆలోచించినప్పుడుతరచుగా ఢిల్లీ చిత్రమే గుర్తుకు వస్తుందిఢిల్లీ కేవలం భారత రాజధాని మాత్రమే కాదుఇది భారతదేశ గుర్తింపుభారత శక్తికి చిహ్నంఅందువల్లఢిల్లీ అభివృద్ధి అంటే కేవలం ఒక నగరం అభివృద్ధి మాత్రమే కాదుఇది దేశం మొత్తం ప్రతిష్టతో ముడిపడి ఉందిఢిల్లీ ఎంత ఆధునికంగా మారుతుందోఢిల్లీలో సౌకర్యాలు ఎంత పెరుగుతాయోఢిల్లీ అనుసంధానం ఎంత మెరుగుపడుతుందో అంత బలంగా భారతదేశ ఆత్మవిశ్వాసం ప్రపంచం ముందు కనిపిస్తుందిఅందుకేనేడు మన ఢిల్లీ నగరం సౌకర్యాలుమౌలిక సదుపాయాల పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు నేను సంతోషిస్తున్నానుఒకప్పుడు ఢిల్లీ అంటే కేవలం ఇక్కడి అస్తవ్యస్త ఏర్పాట్ల గురించే చర్చ జరిగే రోజులు ఉండేవినగరంలోని ఒక ప్రాంతం నుంచి మరో  ప్రాంతానికి వెళ్లాలంటే గంటల సమయం పట్టేది.  బస్ స్టాండ్లలో బస్సులుఆటోల కోసం వేచి చూస్తూ తల్లులుఅక్కాచెల్లెళ్ళ సమయం వృధా అయ్యేదికానీ నేడు ఢిల్లీ ముఖచిత్రం మారుతోందికేవలం కొన్ని రోజుల క్రితమేవేగవంతమైన 'నమో భారత్రైలు ఢిల్లీని మీరట్‌తో అనుసంధానించిందిదీనివల్ల ఢిల్లీపశ్చిమ ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణం సులభమైందినేడు మెట్రో నాలుగో దశ ప్రారంభంతోఢిల్లీ మెట్రో నెట్‌వర్క్ పరిధి 375 కిలోమీటర్లు దాటిందిప్రపంచంలోని అనేక పెద్ద నగరాల్లో కూడా ఇంతటి భారీ మెట్రో నెట్‌వర్క్ లేదు.

మిత్రులారా,

నేడు ప్రారంభమైన కొత్త మెట్రో మార్గం రాజధానిలోని లక్షలాది మందికి ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తుందిముఖ్యంగా తూర్పుఈశాన్య ఢిల్లీ ప్రజలకు రోజువారీ ప్రయాణం ఇప్పుడు చాలా సులభం అవుతుందిదీనితో పాటుఢిల్లీ,  ఎన్‌సిఆర్ నగరాలైన ఘజియాబాద్నోయిడాఫరీదాబాద్గురుగ్రామ్ మధ్య ప్రయాణం కూడా మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

మిత్రులారా,

ఏడాది క్రితం ఢిల్లీ ఒక ప్రమాదకరమైన ప్రభుత్వం నుంచి విముక్తి పొందడం ఎంత మంచిదన్నది చెప్పడానికి నేటి కార్యక్రమం ఒక నిదర్శనంఇక్కడ ఆ ప్రమాదకర ప్రభుత్వం లేకపోయి ఉంటేమెట్రో నాలుగో దశ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదికానీ ఆ దుష్ప్రభుత్వ పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలోని లక్షలాది మంది సౌకర్యాలను పక్కన పెట్టారుఇప్పుడు ఇక్కడ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీ సర్వతోముఖాభివృద్ధికి గొప్ప వేగం వచ్చింది.

మిత్రులారా,

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఢిల్లీలోని ప్రతి రవాణా సౌకర్యం ఆధునికత సంతరించుకుంటోందిఢిల్లీలో ప్రతిరోజూ లక్షలాది మంది బస్సుల్లో ప్రయాణిస్తారుఅందుకే ఢిల్లీ ప్రజలకు శుభ్రమైనసౌకర్యవంతమైనఆధునిక బస్సు సేవలు అందించాలన్నది మా ప్రయత్నంకేంద్ర ప్రభుత్వం అందించిన నాలుగు వేల పైగా ఎలక్ట్రిక్ బస్సులు నేడు ఢిల్లీ ప్రజలకు సేవలు అందిస్తున్నాయిగత ఒక్క ఏడాదిలోనే సుమారు 1800 కొత్త బస్సులు ఢిల్లీ రోడ్ల మీదకు వచ్చాయివీటిలో వందలాది "దేవి బస్సులుఢిల్లీలోని కాలనీలనుపరిసర ప్రాంతాలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తున్నాయి.

మిత్రులారా,

దాదాపు పదేళ్ల పాటు ఇక్కడి ప్రమాదకర ప్రభుత్వం ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుందిఇప్పుడు మా ప్రభుత్వం ఢిల్లీకి సంబంధించిన వివిధ సవాళ్లను పరిష్కరించేందుకు ఒక లక్ష్యంతో పనిచేస్తోందిపెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో లక్షలాది వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించాల్సిన అవసరం తప్పిందియమునా నది శుభ్రత కోసం కూడా బిజెపి ప్రభుత్వం భారీ స్థాయిలో పనిచేస్తోందిదీని కోసం కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.

మిత్రులారా,

ఢిల్లీలోని గత ప్రభుత్వం పేదలమధ్యతరగతి ప్రజల లేదా మరెవరి సమస్యలను గురించీ పట్టించుకోలేదుఆ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని కూడా నాశనం చేసిందిఆయుష్మాన్ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ మేము వారికి లేఖలు రాశాంభారత ప్రభుత్వం కూడా లేఖలు రాసిందికానీ ఆ పాలకులు పేదలను ఎప్పుడూ పట్టించుకోలేదుఇప్పుడు రేఖాజీ  నాయకత్వంలోఈ పరిస్థితిని మార్చడానికి బిజెపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నానుగత ఒక్క ఏడాదిలోనేఇక్కడ అనేక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయిదీనివల్ల పేదమధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందిఇప్పుడు ఢిల్లీలో ఆయుష్మాన్ పథకం కూడా అమలవుతోందిఢిల్లీ ప్రజలకు ఉచిత వైద్యం అందుతోందితేడా స్పష్టంగా కనిపిస్తోందితక్కువ పనిఎక్కువ సాకులు చెప్పడం ఆ ప్రమాదకర ప్రభుత్వ పాలకుల విధానంనేడు ఢిల్లీ నమూనా అంటే సాకులు ఆగిపోయాయిపని మొదలైందిగతంలో ప్రాజెక్టులు ఫైళ్లలోనే ఆగిపోయేవినేడు ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి.

మిత్రులారా,

ఇక్కడికి వచ్చే ముందు నేను సరోజినీ నగర్‌కు వెళ్లానుఅక్కడ కొత్తగా నిర్మించిన ప్రభుత్వ గృహాలను చూసే అవకాశం నాకు లభించిందిప్రతి జాతీయ సంకల్పాన్ని నెరవేర్చడానికి పగలు రాత్రి కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ ఇళ్లు నిర్మించాంవారికి సురక్షితమైనశుభ్రమైనసౌకర్యవంతమైన నివాసం లభించడం చాలా అవసరంఅందుకే ఈ కొత్తఆధునిక భవనాలను నిర్మిస్తున్నాంనేడు అటువంటి వేలాది కొత్త ఫ్లాట్లను లబ్ధిదారులకు అందించాంఈ కొత్త ఇళ్లు మన ఉద్యోగులవారి కుటుంబాల జీవితాల్లో కొత్త ఆనందాన్నికొత్త ఆశను నింపుతాయని నేను నమ్ముతున్నాను.

మిత్రులారా,

నేడు దేశంలో ఎక్కడ బిజెపి ప్రభుత్వం ఉన్నాప్రతి రాష్ట్రంలోప్రతి గ్రామంలోనగరంలో ప్రజలు ఏదో ఒక పథకం ద్వారా కచ్చితంగా ప్రయోజనం పొందుతున్నారుమన పేద కుటుంబాలుమన తల్లులుఅక్కాచెల్లెళ్ళుమన కార్మికులురైతులుచిన్న చిన్న పనులు చేసుకునే మన సోదరీ,సోదరులు వీరందరి కోసం ప్రభుత్వం ఏదో ఒక పని చేస్తూనే ఉందిమన వీధి వ్యాపారులనే ఉదాహరణగా తీసుకుందాంకరోనా సమయంలో మన దైనందిన జీవితాల్లో వారి ప్రాముఖ్యతను గుర్తించాంఒకప్పుడు తోపుడు బండ్లను కూడా అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితిలో వీరు ఉండేవారుఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టడానికి కూడా వేరే వారి దగ్గర ఒకటి లేదా రెండు వేల రూపాయలను భారీ వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చేదికానీ మా ప్రభుత్వం వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారిని బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించిందినేడు ప్రధానమంత్రి స్వనిధి యోజన ద్వారాఅటువంటి లబ్ధిదారులు తమ వ్యాపారాల కోసం సులభంగా రుణాలు పొందుతున్నారుఢిల్లీలో కూడా సుమారు లక్షల మంది వీధి వ్యాపారులు ఈ పథకం ద్వారా దాదాపు 350 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పొందారు.

మిత్రులారా!

ఇప్పుడేవీధిలో బండ్లపై వ్యాపారం చేసే కొందరు మహిళలతో ముచ్చటించే అవకాశం నాకు లభించిందివారంతా ఎంత బాగా ముందంజ వేస్తున్నారో విని నా హృదయం గర్వంతో ఉప్పొంగింది.

మిత్రులారా!

ఒకనాడు ఇదే ఢిల్లీ నగరంలో డెబిట్-క్రెడిట్ కార్డులు ధనవంతుల చేతుల్లోనే కనిపించేవికానీనేడు పరిస్థితి మారుతోంది... మన వీధి వ్యాపారులతోపాటు బండ్ల కార్మికులు కూడా క్రెడిట్ కార్డు సదుపాయం పొందుతున్నారుఈ వ్యాపారులకు స్వానిధి క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందిఇకపై తమ జేబులోని క్రెడిట్ కార్డును వారు అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చుఇంతకుముందే ఈ వేదికపైన స్వానిధి క్రెడిట్ కార్డులలో కొన్నింటిని నా చేత్తో మహిళలకు అందజేసే అవకాశం లభించిందిఇప్పడివి పేదల ఆత్మగౌరవం పెంచే సరికొత్త మాధ్యమంగా మారుతున్నాయి.

మిత్రులారా!

ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో దేశంలోని లక్షలాది సోదరీమణులతో మరొక ఆనందకర అంశాన్ని పంచుకోవాలని భావిస్తున్నానుకొన్నేళ్ల కిందట దేశంలోని కోట్ల మంది మహిళలను “లక్షాధికారి సోదరి”గా మార్చాలని మేము నిశ్చయించుకున్నాంగ్రామీణ మహిళలు లక్షాధికారులు కావడమన్నది ఎన్నికల్లో గెలవడం కోసం మోదీ చెప్పిన అబద్ధమని చాలా మంది నన్ను హేళన చేశారునన్నెంతగానో విమర్శించారు... చులకనగా తీసిపారేశారువివిధ సామాజిక మాధ్యమ వేదికలు చలోక్తులతో నిండిపోయాయికానీ నేడు.. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నా తల్లులుసోదరీమణులు అపార శక్తిమంతులని నేను సగర్వంగా ప్రకటిస్తున్నానుఅవకాశం లభించాలేగానీవారు సాధించలేని విజయమంటూ ఏదీ ఉండదుకాబట్టే, 3 కోట్ల మంది మహిళలను “లక్షాధికారులు”గా మారుస్తామన్న మా సంకల్పం నెరవేరిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నానువాస్తవానికి వారి సంఖ్య కోట్లను మించిపోయింది.

మిత్రులారా!

గ్రామీణ ప్రాంతాల్లోని మా సోదరీమణులు దశాబ్దాలుగా తమ నైపుణ్యాన్ని చాటుకుంటూనే ఉన్నారువారెంతో శ్రమజీవులైనాతగినంత మూలధనంతోపాటు అవకాశాల అందుబాటు స్వల్పంకాబట్టే,  స్వయం సహాయ సంఘాలతో... బ్యాంకులతో మేం అనుసంధానించాంవారికి సరికొత్త పద్ధతుల్లో శిక్షణ ఇచ్చిఅవకాశాలతోపాటు మార్కెట్‌ సౌలభ్యం కల్పించాంఇప్పుడ దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మహిళలు ఇలాంటి సంఘాలతో ముడిపడి ఉన్నారుఈ స్వయం సహాయ సంఘాలకు రూ.లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందుతోందిఫలితంగాగ్రామీణ మహిళలు స్వావలంబన సాధించడమే కాకుండా తమ కుటుంబాల ఆదాయం పెంచుకుంటున్నారుతద్వారా “లక్షాధికారి సోదరి”గా మారిగ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నారు.

మిత్రులారా!

మన సోదరీమణుల విజయం సరికొత్త సంకల్పం పూనడంలో మాకు స్ఫూర్తినిచ్చిందిఆదిలో కోట్ల మందిని ‘లక్షాధికారి సోదరి’ స్థాయికి తేవడం ఒకరకంగా అసాధ్యమనే అనిపించిందికానీఆ సంకల్పం నేడు సాకారమైన నేపథ్యంలో మరో కోట్ల మందిని ఈ జాబితాలో జోడించాలని కృతనిశ్చయం పూనాంఅంటేఇప్పటికే లక్షాధికారులైన కోట్ల మందికి అదనంగామరో కోట్ల మందిని వారి సరసన చేర్చాలని సంకల్పించాంమన దేశ నారీశక్తి ఆశీస్సులతో ఇది కూడా సాకారం కాగలదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

సోదరీసోదరులారా!

దేశం ఇవాళ మన తల్లులుఅక్కచెల్లెళ్లుకుమార్తెల విజయోత్సవం చేసుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీ వాసులతోదేశంతో నేనొక వేదనను పంచుకోవాలని భావిస్తున్నానుఈ బాధదుఃఖంహృదయానికి తగిలిన లోతైన గాయాన్ని పౌరుల ముందు వెలిబుచ్చాలని అనుకుంటున్నానుఇవాళ మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నాంకానీనిన్న పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం మన రాష్ట్రపతిగౌరవనీయ ద్రౌపది ముర్మును తీవ్రంగా అవమానించిందిఆమె సంతాల్ గిరిజన సంప్రదాయం ప్రధానోత్సవంలో పాల్గొనడానికి బెంగాల్‌ వెళ్లారుఅయితేఆమెతోపాటు ముఖ్యమైన గిరిజన కార్యక్రమాన్ని గౌరవించే బదులుసంతాల్ ప్రజల పవిత్ర కార్యక్రమం సహా అధ్యక్షురాలిని టీఎంసీ బహిష్కరించిందిఆమె స్వయంగా గిరిజన సమాజం నుంచి వచ్చారు... సంతాల్ ప్రజల ప్రగతి కోసం ఎంతో కృషి చేశారుకానీటీఎంసీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని గందరగోళంలో పడేసింది.

మిత్రులారా!

ఇది రాష్ట్రపతిని అవమానించడం మాత్రమే కాదు... రాజ్యాంగాన్నిరాజ్యాంగ స్ఫూర్తినిప్రజాస్వామ్య ఘన సంప్రదాయాన్ని కూడా అవమానించడమేపోరాటాల ద్వారా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ప్రతి సోదరినికుమార్తెను కూడా ఘోరంగా అవమానించడమే!

మిత్రులారా!

మన సంప్రదాయం ఏమంటోందంటే- “అహంకారే హతః పుష్ఠః సమూలాం చ వినశ్యతి” అంటే... నిలువెల్లా అహంకారం నిండిన వ్యక్తిఎంత శక్తిమంతుడైనాచివరికి నశించక తప్పదుఅని అర్థంఈ నేపథ్యంలో ఇవాళ దేశ రాజధాని నుంచి మీకందరికీ నా విన్నపం ఏమిటంటేగిరిజన రాష్ట్రపతిని అవమానించిన టీఎంసీ నీచ రాజకీయంఅధికార దురహంకారం త్వరలో సమసిపోవాలిగిరిజనులనుఅందునా గౌరవనీయ రాష్ట్రపతిని అవమానించిన టీఎంసీని పశ్చిమ బెంగాల్‌లోని వివేచనగల పౌరులు ఎన్నటికీ క్షమించరుఈ దేశం... గిరిజన సమాజం... మహిళా శక్తి కూడా వారిని ఎప్పటికీ క్షమించవు.

మిత్రులారా!

ప్రతి వర్గాన్నిప్రతి ఆలోచనను గౌరవించాలన్నది మన సంస్కృతి మనకు నేర్పిన సూత్రంఅలాగేమన వారసత్వం పట్ల గర్వించాలని కూడా నేర్పిందిఈ స్ఫూర్తితో నేడు మనం ఢిల్లీ వారసత్వాన్ని కాపాడుకోవడానికీ కృషి చేస్తున్నాంఇటీవలి సంవత్సరాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం “వారసత్వ సహిత ప్రగతి” తారకమంత్రంగా పనిచేసిందిఢిల్లీలోని అనేక చారిత్రక ప్రదేశాలను సుందరీకరించిందిఅలాగే అనేక కొత్త ప్రదేశాలు కూడా నిర్మితమయ్యాయిదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుల గౌరవార్థం జాతీయ యుద్ధ స్మారకం నిర్మించాంకొత్త పార్లమెంట్ భవనంకర్తవ్యపథ్‌కర్తవ్య భవన్సేవా తీర్థ్‌ అన్నీ ఈ 21వ శతాబ్దపు భారత్‌ నవ్య దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయికొద్ది రోజుల కిందట భారత్ మండపంలో చారిత్రక అంతర్జాతీయ ఏఐ శిఖరాగ్ర సదస్సు నిర్వహించాంభారత్ మండపంయశోభూమి వంటి ప్రాంగణాలు భారత సంస్కృతివాణిజ్యంసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రధాన వేదికలుగా రూపొందాయిప్రధానమంత్రి మ్యూజియంయుగే-యుగే భారత్ మ్యూజియం వంటి కొత్త ప్రదర్శనశాలలు కూడా ఢిల్లీ ప్రతిష్ఠను మరింత బలోపేతం చేస్తున్నాయి.

మిత్రులారా!

దేశ చారిత్రక ప్రస్థానంలో ఢిల్లీ నగరానికి ప్రత్యేక స్థానముందినేడు ఈ నగరం ఓ నవ శకానికి సాక్షిగా నిలుస్తోందిఇది నవ భారత్‌ ఆత్మవిశ్వాస యుగం... ఈ ఆత్మవిశ్వాసం మనల్ని వికసిత పథంలో భవిష్యత్తు వైపు నడిపిస్తుందిఅందువల్ల ప్రతి సంకల్పాన్ని సాకారం చేసుకోవడానికి మనమంతా సమష్టిగా కృషి చేయాలిముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్తాఆమె బృందం సారథ్యాన ఢిల్లీలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఊపందుకుంటుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నానుఢిల్లీలోని ప్రతి కుటుంబం సంపన్నమైమరింత మెరుగ్గాసంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నానుఈ సామరస్య స్ఫూర్తితో ఈ అభివృద్ధి పనులపై మరోసారి మీకందరికీ నా హృదయపూర్వక అభినందనలుశుభాకాంక్షలు తెలుపుతున్నానుఇప్పుడు నాతోపాటు గళమెత్తి బిగ్గరగా నినదించండి:

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

వందే మాతరం!

 

***


(రిలీజ్ ఐడి: 2236885) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada