ప్రధాన మంత్రి కార్యాలయం
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 MAR 2026 10:54PM by PIB Hyderabad
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యుత్తమ నైపుణ్యాలనూ, సంకల్పాన్నీ, సమష్టి కృషినీ ఈ విజయం ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు. ఈ టోర్నమెంట్ అంతా అసాధారణ పట్టుదలను జట్టు ప్రదర్శించిందని ప్రశంసించారు.
ఈ విజయం ప్రతి భారతీయుని హృదయాన్ని గర్వంతో, ఆనందంతో నింపిందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని చేసిన పోస్టు:
‘‘ఛాంపియన్స్!
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు!
అత్యుత్తమ నైపుణ్యాలనూ, సంకల్పాన్నీ, సమష్టి కృషినీ ఈ విజయం ప్రతిబింబిస్తుంది. ఈ టోర్నమెంట్ మొత్తం అసాధారణ పట్టుదలను వారు ప్రదర్శించారు.
ఈ విజయం ప్రతి భారతీయుని హృదయాన్ని గర్వంతో, ఆనందంతో నింపేసింది.
వెల్డన్, టీమ్ ఇండియా!’’
***
(రిలీజ్ ఐడి: 2236882)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5