ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దృఢ సంకల్పం, సంయమనం, ఆత్మవిశ్వాసం.. ఈ విలువలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 09 MAR 2026 9:33AM by PIB Hyderabad

జీవితంలో విజయ సాధనకు కీలకం దృఢ సంకల్పంసంయమనంతో పాటు ఆత్మవిశ్వాసాల కలయిక కీలకమని టీమ్ ఇండియా టీ20 క్రికెట్ ప్రపంచ కప్పును గెలుచుకొని నిరూపించిందని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారుసరైన దిశగా నిరంతర శ్రమ చేస్తూ ఉంటే ప్రతి లక్ష్యాన్నీ సాధించడం సాధ్యపడుతుందని కూడా ఈ విజయం రుజువు చేసిందని ఆయన అన్నారు.

సంస్కృత భాషలోని ఈ కింది సుభాషితాన్ని ప్రజలతో  ప్రధాని పంచుకున్నారు:

‘‘అభీప్సాం స్వాత్మనో రక్షావిరతం సుస్థిరం తయా
యత్నమాతిష్ఠ ధైర్యేణ తతసిద్ధిర్భవేద్ ధ్రువమ్’’.

ఎవరైనా జీవితంలో పురోగతిని సాధించాలని కోరుకుంటే పట్టుదలతోనూదృఢ నిశ్చయంతోనూ గట్టిగా కృషి చేయాలినిరంతర కఠిన శ్రమకు సంయమనం తోడయితే విజయానికి తప్పక బాటను పరుస్తుందని  ఈ సుభాషితం సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘
టీ20 క్రికెట్ వరల్డ్ కప్పును టీమ్ ఇండియా గెలిచిదృఢ సంకల్పంసంయమనంఆత్మవిశ్వాసాల సంగమమే జీవితంలో సఫలతకు మూల మంత్రమని రుజువు చేసింది.  సరైన దిశగా కఠిన పరిశ్రమ చేయడం ద్వారా ప్రతి లక్ష్యాన్నీ చేజిక్కించుకోవచ్చని కూడా ఈ విజయం చాటిచెబుతోంది.

‘‘అభీప్సాం స్వాత్మనో రక్షావిరతం సుస్థిరం తయా
యత్నమాతిష్ఠ ధైర్యేణ తతసిద్ధిర్భవేద్ ధ్రువమ్’’ అని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2236881) आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam