ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించినందుకు నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 07 MAR 2026 5:15PM by PIB Hyderabad

నేపాల్‌లో ఎన్నికలు విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహించినందుకు ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అభినందనలు తెలిపారు.

నేపాల్ ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కును ఇంత గొప్ప ఉత్సాహంతో వినియోగించుకోవడం ఎంతో సంతోషకరమని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఎన్నికల విజయాన్ని నేపాల్ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా, గర్వించదగ్గ క్షణంగా ఆయన అభివర్ణించారు.

సన్నిహిత మిత్రునిగా, పొరుగు దేశంగా నేపాల్ ప్రజలతో, అక్కడి కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఉమ్మడి శాంతి, పురోగతి, అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించడానికి ఈ సహకారం కొనసాగుతుందని ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘నేపాల్‌లో ఎన్నికలు విజయవంతంగా, శాంతియుతంగా జరిగినందుకు అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు. నా నేపాలీ సోదర సోదరీలు తమ ప్రజాస్వామ్య హక్కులను ఇంత చైతన్యవంతంగా వినియోగించుకోవడం చూడటం ఎంతో ఆనందంగా ఉంది.

ఈ చారిత్రాత్మక మైలురాయి నేపాల్ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక గర్వకారణమైన సమయం.

సన్నిహిత మిత్రునిగా, పొరుగు దేశంగా.. నేపాల్ ప్రజలు, వారి కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మన ఉమ్మడి శాంతి, పురోగతి, శ్రేయస్సును కొత్త శిఖరాలకు చేర్చడానికి మేం కట్టుబడి ఉన్నాం’’.


(रिलीज़ आईडी: 2236627) आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam