రాష్ట్రపతి సచివాలయం
పత్రికా ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
05 MAR 2026 11:36PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్ గవర్నరు డాక్టర్ సి.వి. ఆనంద బోస్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.
గవర్నరు, లెఫ్టినెంట్ గవర్నరు పదవులకు నియామకాలను రాష్ట్రపతి ఈ కింద పేర్కొన్న విధంగా ప్రకటించారు:-
(i) హిమాచల్ ప్రదేశ్‌కు గవర్నరుగా ఉన్న శ్రీ శివ్ ప్రతాప్ శుక్లాను తెలంగాణకు గవర్నరుగా నియమించారు.
(ii) తెలంగాణకు గవర్నరుగా ఉన్న శ్రీ జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు గవర్నరుగా నియమించారు.
(iii) నాగాల్యాండ్‌కు గవర్నరుగా శ్రీ నంద్ కిశోర్ యాదవ్‌ను నియమించారు.
(iv) బీహారుకు గవర్నరుగా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నెయిన్‌ను నియమించారు.
(v) తమిళ నాడుకు గవర్నరుగా ఉన్న శ్రీ ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్‌కు గవర్నరుగా నియమించారు.
(vi) కేరళకు గవర్నరుగా ఉన్న శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. తమిళ నాడు గవర్నరు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
(vii) లద్దాఖ్‌కు లెఫ్టినెంట్ గవర్నరుగా ఉన్న శ్రీ కవీందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్‌కు గవర్నరుగా నియమించారు.
(viii) ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నరుగా ఉన్న శ్రీ వినయ్ కుమార్ సక్సేనాను లద్దాఖ్‌కు లెఫ్టినెంట్ గవర్నరుగా నియమించారు.
(ix) ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నరుగా శ్రీ తరణ్‌జీత్ సింగ్‌ను నియమించారు.
పైన పేర్కొన్న నియామకాలు.. ఆయా వ్యక్తులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించే తేదీ నాటి నుంచి అమల్లోకి వస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2235896)
సందర్శకుల సూచీ సంఖ్య : : 84