ప్రధాన మంత్రి కార్యాలయం
దృఢ సంకల్పానికీ, నిరంతర శ్రమకీ ఉన్న శక్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2026 9:36AM by PIB Hyderabad
భారత ప్రజలు వారి దృఢ సంకల్పంతో అత్యంత కష్టమైన పనులను కూడా సాధ్యం చేస్తారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సరైన దిశలో అలుపెరుగని ప్రయత్నం చేసి, అతి పెద్ద లక్ష్యాల్ని కూడా వారు సాధిస్తారని ఆయన తెలిపారు.
సంస్కృత భాషలోని ఒక సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
‘‘యద్ దూరం యద్ దురారాధ్యం యచ్చ దూరే వ్యవస్థితమ్
తత్ సర్వం తపసా సాధ్యం తపో హి దురతిక్రమమ్’’ అని పేర్కొన్నారు.
లక్ష్యం సుదూరమైనదని, కఠినమైనదని లేదా అందుబాటులో లేనిదన్నట్టు కనిపించినా, దృఢ సంకల్పం, నిరంతర శ్రమతో దానిని సాధించవచ్చు. సంకల్పం, సహనం అనే శక్తులు అసంభవాన్ని కూడా సంభవం చేయగలవు అనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
భారత్‌లో ప్రజలు తమ దృఢ నిశ్చయంతో ఏ కార్యాన్ని అయినా సరే సాధ్యమయ్యేదిగా మార్చేస్తారు. సరైన దిశలో అలుపెరుగని శ్రమ చేసి, అతి పెద్దదైన లక్ష్యాన్ని కూడా వారు సాధిస్తారు.
‘‘యద్ దూరం యద్ దురారాధ్యం యచ్చ దూరే వ్యవస్థితమ్
తత్ సర్వం తపసా సాధ్యం తపో హి దురతిక్రమమ్’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2235895)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam