యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర బడ్జెట్‌తో మమేకమవుతున్న భారత యువత: ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026’ 2వ దశలో దాదాపు 47,000 వ్యాసాలతో సరికొత్త రికార్డు మార్చి 15 నుంచి ప్రధానమంత్రితో బడ్జెట్ ఆలోచనలను పంచుకోనున్న మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026 విజేతలు

నాడు పోస్టు చేయడమైనది: 05 MAR 2026 3:52PM by PIB Hyderabad

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'మేరా యువ భారత్' నిర్వహించిన 'మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026'కు దేశవ్యాప్తంగా యువత నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ పోటీలోని రెండో దశలో దాదాపు 47,000 వ్యాసాలు సమర్పణతో సరికొత్త రికార్డు నమోదైంది. కేంద్ర బడ్జెట్‌పై అవగాహన పెంచుకోవటంతో పాటు 'వికసిత్ భారత్@2047' దార్శనికతకు తమ వంతు ఆలోచనలను అందించడంలో భారత యువతలో పెరుగుతున్న ఉత్సాహానికి ఇది నిదర్శనంగా ఉంది. 

కేంద్ర బడ్జెట్ 2026 'యువ శక్తి' దిశగా సాగే పద్దుగా విస్తృత గుర్తింపు పొందింది. విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ఆవిష్కరణలు, భవిష్యత్ వృద్ధికి అవసరమైన అవకాశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత యువతను సాధికారులను చేసేందుకు ఈ బడ్జెట్ అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.

ఈ నేపథ్యంలో 'మై భారత్' ప్లాట్‌ఫాం (mybharat.gov.in) వేదికగా నిర్వహించిన 'మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026' ఒక విశిష్టమైన కార్యక్రమంగా నిలిచింది. ఇది కేంద్ర బడ్జెట్‌ను దేశ యువతకు మరింత చేరువ చేయడమే కాకుండా బడ్జెట్ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి, దాని దార్శనికతను విశ్లేషించేందుకు, భారత అభివృద్ధి ప్రయాణంలో తమ వంతు ఆలోచనలను క్రియాశీలకంగా పంచుకోవడానికి యువతకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది.

దేశవ్యాప్త ఆన్‌లైన్ క్విజ్ ద్వారా కేంద్ర బడ్జెట్‌పై యువతలో అవగాహనను పెంపొందించాలన్నది మొదటి దశ లక్ష్యం. దీనికి కొనసాగింపుగా ఉన్న 'మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026'.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 12,00,000 కంటే ఎక్కువ మంది యువతీ యువకుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అత్యధిక భాగస్వామ్యంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

క్విజ్ పోటీల అనంతరం ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను 'వ్యాస రచన' పోటీలకు ఎంపిక చేశారు. ఈ దశలో వారు భారతదేశ అభివృద్ధి ప్రయాణానికి సంబంధించిన వివిధ అంశాలపై తమ వినూత్న ఆలోచనలు, విధానపరమైన దృక్పథాలను ప్రదర్శించారు.

కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యతలు, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ వ్యాసాలు ఈ కింది తొమ్మిది కీలక అంశాల ఆధారంగా ఉన్నాయి:

  1. వికసిత్ కృషి: వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతు సంక్షేమాన్ని బలోపేతం చేయడం

  2. మానవ వనరులు : విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో పెట్టుబడులు.

  3. వృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల ద్వారా అభివృద్ధి చెందిన భారత్.

  4. మహిళా నేతృత్వం, సమగ్ర అభివృద్ధి: అభివృద్ధి చెందిన భారత్‌కు ఇదే కీలకం

  5. సులభతర వాణిజ్యం : అభివృద్ధి చెందిన భారత్ కోసం వ్యాపార నిర్వహణను సరళతరం చేయడం.

  6. భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ: డిజిటల్, సాంకేతిక, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థ.

  7. భారతదేశాన్ని గ్లోబల్ వ్యవస్థాపకత కేంద్రంగా తీర్చిదిద్దడం.

  8. హరిత వికసిత్ భారత్: పర్యావరణహిత, సుస్థిర అభివృద్ధి.

  9. భారతదేశ క్రీడా విప్లవం: పరిశోధన, తయారీ, ప్రపంచ క్రీడా కేంద్రంగా ఎదిగే లక్ష్యం.

ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో విజేతలుగా నిలిచిన యువతకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేరుగా ముఖాముఖి మాట్లాడే అవకాశం లభించనుంది. 2026 మార్చి 15 నాడు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో కేంద్ర బడ్జెట్‌, 'వికసిత్ భారత్' దిశగా సాగుతున్న ప్రయాణంలో బడ్జెట్ చూపబోయే ప్రభావం గురించి వారు ప్రధానితో చర్చించనున్నారు.

ఈ ముఖాముఖి కార్యక్రమం భారత యువత తమ ఆలోచనలను దేశ నాయకత్వంతో పంచుకోవడానికి ఒక విశిష్టమైన వేదికను అందిస్తుంది. ఇది 'భాగస్వామ్య పాలన' స్ఫూర్తి, 'యువ శక్తి' నేతృత్వంలోని దేశ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026’లో యువశక్తి చూపించిన అద్భుతమైన భాగస్వామ్యం ‘వికసిత్ భారత్’ కోసం విధానాలు, పరిష్కారాలను రూపొందించడంలో చురుగ్గా పాల్గొనాలనే భారతదేశ ‘అమృత పీఢి’ ఆకాంక్షలను ప్రధానంగా తెలియజేస్తోంది. 2047 నాటికి భారత్‌ను ‘ఆత్మనిర్భర్ వికసిత్ భారత్’గా తీర్చిదిద్దే ప్రయాణంలో దేశంలోని యువ మేధస్సు కీలక భాగస్వాములని ఇది పునరుద్ఘాటిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2235690) సందర్శకుల సూచీ సంఖ్య : : 99
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil