ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిన్లాండ్ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల జాబితా
నాడు పోస్టు చేయడమైనది:
05 MAR 2026 4:36PM by PIB Hyderabad
అవగాహన ఒప్పందాలు/ఒప్పందాలు
|
Sl. No
|
MoU / Agreement
|
Description
|
|
1
|
వలసలు, రవాణా భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం
|
భారతీయ నిపుణుల కోసం ముఖ్యంగా టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో ఫిన్లాండ్ ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా అవతరించింది. వలసలు, రవాణా భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం ప్రతిభ గల యువత రాకపోకలను సులభతరం చేస్తుంది.
|
|
2
|
పర్యావరణ రంగ సహకారంపై అవగాహన ఒప్పందం పునరుద్ధరణ
|
నవంబర్ 2020లో సంతకం చేసిన అవగాహన ఒప్పందం పునరుద్ధరించడం. ఇది జీవఇంధనం, వ్యర్థాల నుంచి ఇంధన పరిష్కారాలు, విద్యుత్ నిల్వ, సౌకర్యవంతమైన ఆర్ఈ వ్యవస్థలు, గ్రీన్ హైడ్రోజన్, అలాగే పవన, సౌర, చిన్న జల విద్యుత్ సహా సుస్థిరతకు దోహదపడే కీలక సహకార రంగాలను కలిగి ఉంది.
|
|
3
|
గణాంకాల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం
|
అధికారిక గణాంకాల రంగంలో పరస్పర సహకారాన్ని అభివృద్ధి చేసుకోవడం, అనుభవాలు/ఉత్తమ పద్ధతులు, సహకారాన్ని పంచుకోవడం.
|
ప్రకటనలు
|
|
Title
|
|
1
|
భారత్-ఫిన్లాండ్ ద్వైపాక్షిక సంబంధాలను "డిజిటలైజేషన్, సుస్థిరతలో వ్యూహాత్మక భాగస్వామ్యం" స్థాయికి పెంపొందించడం
|
|
2
|
భారత శాస్త్ర సాంకేతిక విభాగం, ఫిన్లాండ్ కు చెందిన ఫిన్నిష్ ఇన్నోవేషన్ ఫండింగ్ ఏజెన్సీ మధ్య ఉమ్మడి పరిశోధనా ప్రాజెక్టులను ప్రారంభించడం
|
|
3
|
2030 నాటికి భారత్-ఫిన్లాండ్ మధ్య ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యం (ఇటీవల కుదిరిన భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఉపయోగించడం)
|
|
4
|
డిజిటలైజేషన్ (5జీ, 6జీ, క్వాంటం కమ్యూనికేషన్స్, అధిక పనితీరు, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకారాన్ని పెంపొందించడం) పై క్రాస్-సెక్టోరల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు.
|
|
5
|
6జీ పై ఉమ్మడి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు (ఫిన్లాండ్‌లోని ఔలు విశ్వవిద్యాలయం, భారత్ 6జీ అలయన్స్ ద్వారా 6జీ పరిశోధన)
|
|
6
|
ఇండో-ఫిన్లాండ్ స్టార్టప్ కారిడార్ ద్వారా అంకురసంస్థ వ్యవస్థల మెరుగైన అనుసంధానం (హెల్సింకిలోని స్లష్‌లో భారతీయ అంకురసంస్థలు, న్యూఢిల్లీలోని స్టార్టప్ మహాకుంభ్‌లో ఫిన్నిష్ అంకురసంస్థల చురుకైన భాగస్వామ్యం)
|
|
7
|
2026లో భారత్‌లో వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరంను సంయుక్తంగా నిర్వహించడం (భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ-ఫిన్నిష్ ఇన్నోవేషన్ ఫండ్ ఎస్ఐటీఆర్ఏల ద్వారా)
|
|
8
|
సంబంధిత విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య కాన్సులర్ స్థాయి చర్చలు నిర్వహించడం
|
***
(రిలీజ్ ఐడి: 2235622)
సందర్శకుల సూచీ సంఖ్య : : 64
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam