ప్రధాన మంత్రి కార్యాలయం
హోలీ శుభాకాంక్షలు తెలిపినందుకు అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు
నాడు పోస్టు చేయడమైనది:
04 MAR 2026 10:51PM by PIB Hyderabad
హోలీ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ -
‘‘నా స్నేహితునికి అనేకానేక ధన్యవాదాలు.
పవిత్రమైన హోలీ సందర్భంగా మీతో పాటు ఫ్రాన్స్‌లోని ప్రజలకూ సంతోషం, సమృద్ధీ కలగాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2235455)
సందర్శకుల సూచీ సంఖ్య : : 60
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam