ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఓమన్ సుల్తాన్‌తో మాట్లాడిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2026 6:56PM by PIB Hyderabad

ఓమన్ సుల్తాన్ గౌరవ హైతం బిన్ తారిక్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారుపశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న ఇటీవలి పరిణామాలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు.

ఓమన్ సార్వభౌమాధికారంప్రాదేశిక సమగ్రత ఉల్లంఘనకు గురవటాన్ని ప్రధానమంత్రి తీవ్రంగా ఖండించారుప్రాంతీయ శాంతిస్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి నిరంతర దౌత్యపరమైన చర్చలు అత్యవసరమని ఇరు దేశాల నాయకులు అంగీకరించారు.

భారతీయ సమాజానికి ఓమన్ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ విధంగా పేర్కొన్నారు:

ఓమన్ సుల్తాన్ గౌరవ హైతం బిన్ తారిక్‌తో మాట్లాడానుపశ్చిమాసియాలో జరుగుతున్న ఇటీవలి పరిణామాలపై మేం అభిప్రాయాలను పంచుకున్నాంఓమన్ సార్వభౌమాధికారంప్రాదేశిక సమగ్రత ఉల్లంఘనను తీవ్రంగా ఖండించానుప్రాంతీయ శాంతిస్థిరత్వాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి నిరంతర దౌత్యపరమైన చర్చలు అత్యవసరమని మేం అంగీకరించాంభారతీయ సమాజానికి ఓమన్ అందిస్తున్న నిరంతర మద్దతును మనస్ఫూర్తిగా అభినందించాను"

 

***


(రిలీజ్ ఐడి: 2235257) సందర్శకుల సూచీ సంఖ్య : : 55