ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌ కాకినాడలోని ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం పీఎంఎన్‌ఆర్ఎఫ్‌ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం

प्रविष्टि तिथि: 28 FEB 2026 6:45PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ జిల్లాలోని ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో మృతి చెందిన వారిపట్ల ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారుఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుగాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలుగాయపడిన వారికి రూ.50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి (పీఎంఎన్ఆర్ఎఫ్నుంచి అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవటం బాధాకరంప్రియమైన కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలుగాయపడిన వారికి రూ.50,000 చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందిస్తాం".

 

***


(रिलीज़ आईडी: 2234079) आगंतुक पटल : 42
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam