ప్రధాన మంత్రి కార్యాలయం
చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధానమంత్రి.. ఆయన జీవిత పాఠాన్ని తెలిపే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న పీఎం
నాడు పోస్టు చేయడమైనది:
27 FEB 2026 9:13AM by PIB Hyderabad
భరతమాత వీరపుత్రుడు, ప్రసిద్ధ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.
బానిస సంకెళ్ల నుంచి భరతమాతను విముక్తి చేసేందుకు ఆజాద్ సర్వస్వాన్ని త్యాగం చేశారని, ఆయన చేసిన కృషిని దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందన్నారు.
అమరుడైన విప్లవకారుడి వారసత్వాన్ని స్మరించుకుంటూ.. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలన్న దృఢ సంకల్పమే నిజమైన పరాక్రమానికి నిదర్శనమని చంద్రశేఖర్ ఆజాద్ జీవితం నిరూపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాతృభూమి కోసం ఆయన చేసిన త్యాగం, దేశంలోని ప్రతీ తరానికి స్ఫూర్తిదాయకమని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"భరతమాత వీరపుత్రుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి సందర్భంగా నా హృదయపూర్వక నివాళులు. బానిస సంకెళ్ల నుంచి భరతమాతకు విముక్తి కల్పించేందుకు ఆయన సర్వస్వం త్యాగం చేశారు. దేశం ఆయన్ని ఎల్లప్పుడూ స్మరించుకుంటుంది.
అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలనే సంకల్పంలోనే నిజమైన శౌర్యం ఉందని విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ జీవితం నిరూపిస్తుంది. మాతృభూమి కోసం ఆయన చేసిన త్యాగం దేశంలోని ప్రతీ తరానికి స్ఫూర్తినిస్తుంది.
న హి శౌర్యత్పరం కిచ్చిత్ త్రిషు లోకేషు విద్యతే
శూరః సర్వం పాలయతి సర్వం శూరే ప్రతిష్ఠితం"
"ముల్లోకాల్లోనూ శౌర్యానికి మించినది లేదు. జీవ, నిర్జీవ ప్రపంచాన్ని పోషించే, భద్రత కల్పించే ప్రాథమిక శక్తి శౌర్యం. గౌరవం, సుసంపన్నత, కర్తవ్యం ధైర్యవంతుడి పరాక్రమంలోనే ఉంటాయి"
***
(రిలీజ్ ఐడి: 2233769)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam