ప్రధాన మంత్రి కార్యాలయం
తిరు ఆర్. నల్లకన్ను మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
25 FEB 2026 8:50PM by PIB Hyderabad
తిరు ఆర్. నల్లకన్ను మృతి పట్ల ప్రధానమంత్రి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలతో ఆయనకు గల అనుబంధాన్ని, అణగారిన వర్గాల పక్షాన గళం వినిపించడంలో ఆయన అవిశ్రాంత కృషిని ప్రధానమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.
తిరు ఆర్. నల్లకన్ను సమాజంలోని అన్ని వర్గాల ప్రజల గౌరవం పొందారనీ, ఆయన నిరాడంబరత ఆదర్శప్రాయమైనదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమయంలో తన ఆలోచనలు వారి కుటుంబ సభ్యులు, అభిమానులతో ఉన్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"తిరు ఆర్. నల్లకన్ను అట్టడుగు వర్గాలతో పెంచుకున్న అనుబంధం... అణగారిన వర్గాలు, కార్మికులు, రైతుల గళాన్ని వినిపించడంలో ఆయన ప్రయత్నాలతో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు. సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజల గౌరవాన్ని ఆయన పొందారు. ఆయన నిరాడంబరత ఆదర్శప్రాయమైనది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, అభిమానులతో ఉన్నాయి."
***
(రిలీజ్ ఐడి: 2232905)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6