ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
22 FEB 2026 7:28PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా తాను చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో వరస పోస్టుల్లో పంచుకున్నారు.
‘‘బిజెపి అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వడమే కాకుండా, తన విధానాన్ని, ఉద్దేశాన్ని అన్నిటికంటే పైన ఉంచింది. దీనికి ఒక పెద్ద ఉదాహరణే మీరట్ మెట్రో. దీని వల్ల ఇక్కడి రైతుల నుంచి కళాకారుల వరకు అందరికీ ప్రయోజనం చేకూరుతుంది".
"గడిచిన సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాల వల్ల, మీరట్‌తో సహా ఉత్తరప్రదేశ్‌లోని ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఒక కొత్త వేగం లభించబోతోంది".
‘‘ భారత్ లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సు దేశ ప్రజలకు గర్వకారణం. కానీ, కాంగ్రెస్ ఈ అంతర్జాతీయ వేదికను తన మురికి, నీచ రాజకీయాలకు అస్త్రంగా మార్చడానికి ప్రయత్నించిన తీరు అత్యంత సిగ్గుచేటు".
‘‘బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఎటువంటి లోటు రానీయదని నేను మీకు హామీ ఇస్తున్నా. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందినప్పుడే, భారత్ కూడా అభివృద్ధి చెందుతుంది".
‘‘దేశంలో అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ఈ రోజు చారిత్రాత్మకమైనది. పూర్తి స్థాయి ఢిల్లీ - మీరట్ నమో భారత్ కారిడార్‌ను దేశానికి అంకితం చేయడం గర్వంగా ఉంది".
‘‘దేశ ప్రజల ప్రయాణాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా మార్చడానికి మేము పూర్తి నిబద్ధతతో కృషి చేస్తున్నాం. మీరట్ మెట్రో నెట్‌వర్క్ కూడా ఇక్కడి ప్రజల జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది".
"మీరట్ మెట్రోలో ప్రయాణించే సమయంలో పిల్లలతో చేసిన సంభాషణ ఈ అనుభవాన్ని మరింత చిరస్మరణీయంగా మార్చింది".
“అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో మీరట్ ప్రజల ఉత్సాహం, సంతోషం నన్ను మరింత కొత్త శక్తితో నింపింది”.
***
(రిలీజ్ ఐడి: 2231589)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3