ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ప్రధానమంత్రితో క్వాల్‌కామ్ ఇంక్ ప్రెసిడెంట్, సీఈఓ భేటీ

प्रविष्टि तिथि: 20 FEB 2026 9:12PM by PIB Hyderabad

క్వాల్‌కామ్ ఇంక్ ప్రెసిడెంట్,  సీఈఓ  క్రిస్టియానో ఆర్. అమన్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.  

భారతదేశంలోని ఆవిష్కర్తలు,  స్టార్టప్‌ల బలమైన వ్యవస్థ గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెమీకండక్టర్లు,  చిప్ తయారీ రంగాలలో కలిసి పనిచేయడం గురించి కూడా వారు చర్చించారు. 

"క్వాల్‌కామ్ ఇంక్ ప్రెసిడెంట్,  సీఈఓ  క్రిస్టియానో ఆర్. అమన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. కృత్రిమ మేధ (ఏఐ),  ఇతర భవిష్యత్ సాంకేతిక రంగాలలో భారతీయ ఆవిష్కర్తలు,  స్టార్టప్‌లతో క్వాల్‌కామ్ ఎలా కలిసి పనిచేయగలదనే అంశంపై మేం చర్చించాం. సెమీకండక్టర్లు,  చిప్ తయారీ రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగడం గురించి కూడా మాట్లాడుకున్నాం” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు. 

 

***


(रिलीज़ आईडी: 2231328) आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam