రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ రాష్ట్రపతితో భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 6:09PM by PIB Hyderabad

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ రోజు (2026 ఫిబ్రవరి 20) రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

మానవాళి మొత్తానికి ప్రయోజనం చేకూరేలా కృత్రిమ మేధ విషయంలో అంతర్జాతీయ సైంటిఫిక్ ప్యానల్‌ను ఏర్పాటు చేయాలన్న ఆంటోనియో గుటెరస్ ప్రతిపాదనను రాష్ట్రపతి సాదరంగా స్వాగతించారు. .

ఏఐ ఇంపాక్ట్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంలో భారత్ పోషించిన నాయకత్వ పాత్ర, వివిధ రంగాలలో ఐక్యరాజ్యసమితితో భారత్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ప్రధాన కార్యదర్శి అభినందించారు.

ప్రస్తుత ప్రపంచ అనిశ్చితుల సమయంలో బహుపాక్షికవాదం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని, దేశాల మధ్య విశ్వసనీయత లోటు పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్న పాత  వ్యవస్థను తప్పనిసరిగా ప్రస్తుత భౌగోళిక-రాజకీయ వాస్తవ పరిస్థితులను అనుగుణంగా సంస్కరించాలని, నిర్ణయాధికారాల్లో 'గ్లోబల్ సౌత్'కు తగిన ప్రాధాన్యత ఉండాలని ఆమె తెలిపారు. ఐక్యరాజ్యసమితికి ఉన్న ప్రాముఖ్యత, ప్రభావాన్ని కాపాడుకోవడానికి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలే కీలకమని ఆమె ఉద్ఘాటించారు.

‘యూఎన్ -80' కార్యక్రమం సంస్కరణలకు ఒక మంచి వేదికను అందిస్తున్నప్పటికీ ఏవైనా పునర్‌వ్యవస్థీకృత ప్రక్రియలు చేపట్టినప్పుడు 'గ్లోబల్ సౌత్' అభివృద్ధి ప్రాధాన్యతలు దెబ్బతినకుండా రక్షించటం చాలా ముఖ్యమని రాష్ట్రపతి పేర్కొన్నారు.

 

***

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా ఆంటోనియో గుటెరస్ మిగిలిన పదవీకాలం విజయవంతంగా సాగాలని రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు. బహుపాక్షికవాదానికి భారత్ పూర్తి మద్దతును ఎల్లప్పుడూ కొనసాగిస్తుందని ఆమె మరోసారి స్పష్టం చేశారు.


(రిలీజ్ ఐడి: 2231079) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam