ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఐఏ ఇంపాక్ట్ సమ్మిట్‌లో నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్‌లో బాధ్యతాయుత కృత్రిమ మేధ పట్ల ప్రపంచ నిబద్ధతను స్పష్టం చేసిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 10:05PM by PIB Hyderabad

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్ ఫలితాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్.. ఏఐ), సాంకేతికతలతో పాటు నవకల్పన రంగాలకు చెందిన అగ్రగామి ఆసక్తిదారులు ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
లోతైన అవగాహనతో, భవిష్యత్ అవసరాలపై దృష్టిని సారిస్తూ ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా కృత్రిమ మేధ సేవల్ని బాధ్యతాయుత విధానంలో విస్తరింప చేయడం, ప్రపంచ దేశాల సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు అభివృద్ధి ప్రధాన అవకాశాలను సద్వినియోగపరచడంపైన కూడా ఈ చర్చల్లో దృష్టి సారించారు.
మానవ ప్రగతితో పాటు సుస్థిర అభివృద్ధి సాధనకు కృత్రిమ మేధను ఉపయోగించే విషయంలో ఉమ్మడి నిబద్ధతను వ్యక్తం చేయడం సంతోషదాయకమని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించిన సీఈఓ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కృత్రిమ మేధ, సాంకేతికతలతో పాటు నవకల్పన రంగాలకు చెందిన అగ్రగామి ఆసక్తిదారులు పాలుపంచుకున్నారు. లోతైన అవగాహనతో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ చర్చలు సాగాయి.. ముఖ్యంగా కృత్రిమ మేధ సేవల్ని బాధ్యతాయుత విధానంలో విస్తరింపచేయడం, ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని దృఢతరం చేసుకోవడంతో పాటు అభివృద్ధికి గల అవకాశాలను సద్వినియోగపరుచుకోవడంపై ఈ చర్చలలో శ్రద్ధ తీసుకున్నారు.
మానవ ప్రగతి సాధనతో పాటు సుస్థిర అభివృద్ధి దిశగా కృత్రిమ మేధను ఉపయోగించుకొనే అంశంలో సమష్టి నిబద్ధతను వ్యక్తం చేయడం ఉత్సాహపరిచింది’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2230638) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Gujarati , Kannada , Malayalam