ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 12:36PM by PIB Hyderabad

ప్రముఖులు,, గౌరవ మంత్రులుపరిశ్రమల అధినేతలుఆవిష్కర్తలుపారిశ్రామికవేత్తలుపరిశోధకులుప్రతినిధులువిశిష్ట అతిథులుఅందరికీ నమస్తే!

ప్రపంచంలోనే అతిపెద్దచారిత్రాత్మక ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు మీ అందరికీ సాదర స్వాగతంమానవాళిలో ఆరో వంతు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్‌లో ఈ సదస్సు జరుగుతోందిప్రపంచంలోనే అత్యధిక యువ జనాభాఅపారమైన సాంకేతిక ప్రతిభవిస్తృతమైన సాంకేతిక అనుసంధాన వ్యవస్థలకు భారత్ పుట్టినిల్లుభారత్ కొత్త సాంకేతికతలను సృష్టించడమే కాకుండావాటిని మునుపెన్నడూ లేని వేగంతో స్వీకరిస్తుందిఆవిష్కరణలను అందిపుచ్చుకోవడానికి ఉత్సాహంగా ఉన్న 140 కోట్ల భారతీయుల తరపున ఇక్కడ ఉన్న వివిధ దేశాల ప్రభుత్వాధినేతలకుప్రపంచ ఏఐ వ్యవస్థ నాయకులకుఆవిష్కర్తలకు నేను సాదర స్వాగతం పలుకుతున్నానుమీరు ఇక్కడకు విచ్చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

భారత్‌లో ఈ సదస్సు జరగడం కేవలం భారతీయులకే కాకుండాఅభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్దేశాలన్నింటికీ గర్వకారణంఏఐ ప్రపంచంలోని ప్రముఖులందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. 100 పైగా దేశాల ప్రాతినిధ్యంతోప్రపంచవ్యాప్తంగా ఉన్న విశిష్ట వ్యక్తుల భాగస్వామ్యంతో ఈ సదస్సు విజయవంతంగా కొత్త శిఖరాలను చేరుతోందియువత అధిక సంఖ్యలో హాజరుకావడం సరికొత్త విశ్వాసాన్ని కలిగిస్తోందిసాధారణంగాకొత్త సాంకేతికతలు ప్రారంభ దశల్లో సందేహాలను ఎదుర్కొంటాయిఅయితేప్రపంచ యువత ఏఐని స్వీకరిస్తున్న వేగందానిపై చూపుతున్న నమ్మకందానిని సొంతం చేసుకుని ఉపయోగిస్తున్న తీరు నిజంగా అసాధారణంఈ సదస్సులోని ప్రదర్శన కూడా ఎంతో ఉత్సాహాన్ని నింపిందిముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చిన యువ ప్రతిభావంతుల్లో ఇది కనిపిస్తోందిఇక్కడ ప్రదర్శించిన పరిష్కారాలు వ్యవసాయంభద్రతదివ్యాంగులకు సహాయం,  బహుభాషా జనాభా అవసరాలను తీర్చడం వంటివి మేడ్ ఇన్ ఇండియా శక్తికిభారత ఆవిష్కరణా సామర్థ్యాలకు శక్తిమంతమైన ఉదాహరణలు.

మిత్రులారా,

మానవ చరిత్రలో ప్రతి కొన్ని శతాబ్దాలకు ఒక మలుపు వస్తుందిఅది నాగరికత దిశను మారుస్తుందిఅభివృద్ధి వేగాన్ని మారుస్తుంది మన ఆలోచనఅవగాహనపనితీరును కూడా పూర్తిగా మార్చివేస్తుందివిశేషమేమిటంటేఅటువంటి మార్పులతో మనం ముందుకు వెళ్తున్నప్పుడువాటి నిజమైన ప్రభావాన్ని మనం అరుదుగా గుర్తిస్తాం.  రాళ్లతో నిప్పును రగిల్చినప్పుడుఅది నాగరికతకు పునాది అవుతుందని ఎవరూ ఊహించలేదుమాటలు రాతగా మారినప్పుడుఆ లిఖిత జ్ఞానం భవిష్యత్తు వ్యవస్థలకు వెన్నెముక అవుతుందని ఎవరూ అనుకోలేదుసంకేతాలను మొదటిసారి వైర్‌లెస్‌గా పంపినప్పుడుఒకరోజు ప్రపంచమంతా ఇలా క్షణాల్లో అనుసంధానం అవుతుందని ఎవరూ ఊహించలేదు.

మిత్రులారా,

కృత్రిమ మేధ (ఏఐమానవ చరిత్రలో అటువంటి ఒక గొప్ప మార్పుఈరోజు మనం చూస్తున్నవిఅంచనా వేస్తున్నవి దాని ప్రభావానికి కేవలం ప్రారంభ సంకేతాలు మాత్రమేఏఐ యంత్రాలకు తెలివితేటలను ఇస్తోంది.  కానీ అంతకంటే ముఖ్యంగా ఇది మానవ సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుతోందిమునుపెన్నడూ లేని వేగంవిస్తృతి ఇప్పుడు కనిపిస్తున్న ప్రధాన వ్యత్యాసంఈసారి ఉన్న తేడా ఏమిటంటేదీని వేగంవిస్తృతి రెండూ అసాధారణమైనవిగతంలోఒక సాంకేతికత తన ప్రభావాన్ని చూపడానికి దశాబ్దాల సమయం పట్టేదినేడుమెషీన్ లెర్నింగ్ నుంచి  లెర్నింగ్ మెషీన్స్ వరకు సాగుతున్న ఈ ప్రయాణం మరింత వేగంగాలోతుగావిస్తృతంగా ఉందిఅందువల్లమన దార్శనికత కూడా అంతే విస్తృతంగా ఉండాలిమన బాధ్యత కూడా అంతే లోతైనదిగా ఉండాలిప్రస్తుత తరంతో పాటుభవిష్యత్ తరాలకు మనం ఎటువంటి ఏఐని అందిస్తామో కూడా ఆలోచించాలికృత్రిమ మేధ భవిష్యత్తులో ఏమి చేయగలదు అనేది అసలైన ప్రశ్న  కాదుదానితో నేడు మనం ఏమి చేయాలనుకుంటున్నామనేది ముఖ్యంమానవాళి గతంలోనూ ఇటువంటి ప్రశ్నలను ఎదుర్కొందిదీనికి అత్యంత శక్తిమంతమైన ఉదాహరణ అణుశక్తి.  దాని వినాశకరమైన ప్రభావాన్ని  మనం చూశాంఅలాగే దాని సానుకూల సహకారాన్ని కూడా చూశాంఏఐ కూడా ఒక పరివర్తనా శక్తిదీనికి సరైన దిశ లేకపోతే అది విచ్ఛిన్నానికి దారి తీస్తుందిసరైన మార్గంలో నడిపిస్తే అది ఒక పరిష్కారంగా మారుతుందిఏఐని యంత్ర కేంద్రితంగా కాకుండా మానవ కేంద్రితంగాబాధ్యతారహితంగా కాకుండా సున్నితంగా బాధ్యతాయుతంగా ఎలా తీర్చిదిద్దాలి అనేదే ఈ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశ్యం

మిత్రులారా,

ఈ సదస్సు ఇతివృత్తం సర్వజన హితాయసర్వజన సుఖాయ అందరి సంక్షేమంఅందరి సంతోషం ఇందులో ఏఐ పట్ల భారత్ దృక్పథం స్పష్టంగా కనిపిస్తోందిఇదే మన గీటురాయిఏఐ మనుషులను కేవలం డేటా పాయింట్లుగా లేదా ముడి సరుకుగా మార్చకూడదుఅందుకేఏఐ ప్రజాస్వామ్యీకరణ జరగాలిఇది ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల్లో అందరినీ కలుపుకుపోయేసాధికారతనిచ్చే సాధనంగా మారాలి.  

మిత్రులారా,

మనం ఏఐకి విశాలమైన ఆకాశాన్ని ఇవ్వాలికానీ జిపిఎస్  లాగే -  దాని నియంత్రణ మాత్రం మన చేతుల్లోనే ఉంచుకోవాలిఅది మార్గాన్ని సూచిస్తుంది.  కానీ దిశ గురించి తుది నిర్ణయం మనదేఈరోజు మనం ఏఐ కోసం ఎంచుకునే మార్గమే రేపు మనం నిర్మించే భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

మిత్రులారా,

న్యూఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లోనేను ఏఐ కోసం భారత దృక్పథాన్ని ఎంఏఎన్ఏవీ (మానవ్అంటే 'మనిషిఅనే అర్థంతో సమర్పిస్తున్నానుఈ మానవ్  దృక్పథంలో ఎం నైతిక వ్యవస్థలను సూచిస్తుంది.  అంటే ఏఐని నైతిక మార్గదర్శకాలపై నిర్మించాలిఏ -  జవాబుదారీ పాలనకు సంకేతంఅంటే పారదర్శకమైన నిబంధనలుబలమైన పర్యవేక్షణ ఉండాలిఎన్  అంటే జాతీయ సార్వభౌమాధికారండేటా ఎవరైతే సృష్టిస్తారో వారికే చెందుతుందిఏ -  అందరికీ అందుబాటులోసమ్మిళితంగా ఉండడంఏఐ అనేది ఎవరికో ఒకరికే పరిమితమైన గుత్తాధిపత్యం కాకూడదుఅది అందరి సామర్థ్యాన్ని పెంచేదిగా ఉండాలి.  ఇక వీ అంటే చట్టబద్ధమైనదిసరైనది.  ఏఐ చట్టాలకు లోబడిధ్రువీకరించదగినదిగా ఉండాలి. 21వ శతాబ్దపు ఏఐ ఆధారిత ప్రపంచంలో మానవ సంక్షేమానికి భారత ‘మానవ్’ దృక్పథం ఒక కీలకమైన వారధిగా నిలుస్తుంది.

మిత్రులారా,

దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ ప్రారంభమైనప్పుడుఅది ఎన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందో ఎవరూ ఊహించలేదుఏఐ విషయంలోనూ ఇదే నిజంఈ రంగంలో భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాలు వస్తాయో ఈరోజు అంచనా వేయడం కష్టంపని భవిష్యత్తు ను ముందే నిర్ణయించలేంఅది మనం తీసుకునే నిర్ణయాలు,  మనం అనుసరించే కార్యాచరణపై ఆధారపడి ఉంటుందిపని భవిష్యత్తు అనేది ఒక కొత్త అవకాశమని నేను నమ్ముతున్నానుఇది మానవులుమేధో వ్యవస్థలు  కలిసి పనిచేసే యుగం. " మానవులుమేధో వ్యవస్థలు కలిసి సృష్టించేకలిసి పనిచేసేకలిసి మార్పు చెందే యుగంలోకి మనం ప్రవేశిస్తు న్నాం.” ఏఐ మన పనిని మరింత తెలివైనదిగాసమర్థవంతమైనదిగామరింత ప్రభావవంతమైనదిగా మారుస్తుందిమనం మరింత మెరుగ్గా రూపకల్పన చేస్తాంవేగంగా నిర్మిస్తాంబలమైన నిర్ణయాలు తీసు కుంటాంఎక్కువ మంది ప్రజలు ఉన్నత విలువ కలిగినసృజనాత్మకమైనఅర్థవంతమైన పాత్రలను పొందుతారుఆవిష్కరణలువ్యవస్థాపకతకొత్త పరిశ్రమలకు ఇది ఒక గొప్ప అవకాశంఅందువల్లనైపుణ్యాల అభివృద్ధి,  నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం,   నిరంతర అభ్యాసం ఒక ప్రజా ఉద్యమంగా మారాలి.

మిత్రులారా,

పని భవిష్యత్తు అందరినీ కలుపుకుపోయేదిగా నమ్మకమైనదిగామానవ కేంద్రితంగా ఉంటుందిమనం అందరం కలిసి ముందుకు సాగితేకృత్రిమ మేధ మానవాళి సామర్థ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తుంది.

మిత్రులారా,

"సూర్యరశ్మి అత్యుత్తమ క్రిమిసంహారిణిఅని ఒక మాట ఉందిఅంటే పారదర్శకత అనేది అన్నిటికంటే గొప్ప రక్షణ కవచం అని అర్థంకొన్ని దేశాలుకంపెనీలు కృత్రిమ మేధను  ఒక "వ్యూహాత్మక ఆస్తి"గా భావిస్తాయి.  దానిని అత్యంత రహస్యంగా అభివృద్ధి చేయాలని నమ్ముతాయికానీ భారత్ అందుకు భిన్నంగా ఆలోచిస్తుందిఏఐని అందరితో పంచుకున్నప్పుడు మాత్రమే అది ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని మేం నమ్ముతాంకోడ్ లు బహిర్గతంగా,  అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు లక్షలాది మంది యువ మేధావులు వాటిని మరింత సురక్షితంగామెరుగ్గా తీర్చిదిద్దగలరుఅందుకేకృత్రిమ మేధను ఒక ప్రపంచ ఉమ్మడి సంపద గా అభివృద్ధి చేయాలని మనం సంకల్పించుకుందాం.

మిత్రులారా,

నేడు ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పడం మరొక అత్యవసరండీప్‌ఫేక్‌లుసృష్టించిన సమాచారం స్వేచ్ఛాయుత సమాజాలను అస్థిరపరుస్తున్నాయిభౌతిక ప్రపంచంలోమనం ఏం తింటున్నామో తెలుసుకోవడానికి ఆహార పదార్థాలపై పోషక విలువల లేబుళ్లను చూస్తాంఅదేవిధంగాడిజిటల్ ప్రపంచంలో కూడాఏది నిజమోఏది ఏఐ ద్వారా సృష్టించిందో ప్రజలకు తెలియజేయడానికి కంటెంట్‌పై ప్రామాణికత లేబుళ్లు ఉండాలిఏఐ ద్వారా మరింత సమాచారంచిత్రాలువీడియోలు తయారవుతున్న కొద్దీవాటర్‌మార్కింగ్ స్పష్టమైన మూల ప్రమాణాల  అవసరం పెరుగుతోందిఅందుకేసాంకేతికతలో నమ్మకాన్ని మొదటి నుంచీ అంతర్భాగం చేయాలి.

మిత్రులారా,

పిల్లల భద్రత విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలిపాఠశాల పాఠ్యప్రణాళికను ఎంత జాగ్రత్తగా రూపొందిస్తామోఏఐ ప్రపంచం కూడా అలాగే పిల్లలకు సురక్షితంగా,  కుటుంబ మార్గదర్శకత్వంతో కూడినదిగా ఉండాలి.

మిత్రులారా,

నేడుప్రపంచం రెండు రకాల వ్యక్తులుగా విభజితమైంది.  కృత్రిమ మేధలో కేవలం భయాన్ని చూస్తూ,  ఆ భయం గురించి మాత్రమే మాట్లాడేవారు ఒకరైతేఏఐలో అదృష్టాన్ని లేదా ఉజ్వల భవిష్యత్తును చూసేవారు మరొకరు.

మిత్రులారా,

నేను ఎంతో బాధ్యతతోగర్వంతో చెబుతున్నాభారత్ ఏఐ లో భయాన్ని చూడటం లేదుఏఐలో అదృష్టాన్ని చూస్తోందిఏఐలో భవిష్యత్తును చూస్తోందిమా దగ్గర ప్రతిభ ఉందిశక్తిసామర్థ్యం ఉన్నాయిఅలాగే స్పష్టమైన విధానాలు కూడా ఉన్నాయిఈ సదస్సు సందర్భంగా మూడు భారతీయ కంపెనీలు తమ సొంత ఏఐ మోడల్స్ యాప్‌లను ప్రారంభించాయని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నానుఈ మోడల్స్ మన యువత ప్రతిభను చాటిచెప్పడమే కాకుండాభారత్ అందిస్తున్న పరిష్కారాల లోతును,  వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

మిత్రులారా,

భారతదేశం సెమీకండక్టర్లుచిప్ తయారీ నుంచి  క్వాంటం కంప్యూటింగ్ వరకు ఒక దృఢమైన సానుకూల వ్యవస్థను నిర్మిస్తోందిసురక్షితమైన డేటా సెంటర్లుబలమైన ఐటీ పునాది,  చైతన్యవంతమైన స్టార్టప్ వ్యవస్థలు భారత్ ను తక్కువ ఖర్చుతో గణించదగినసురక్షితమైన ఏఐ  పరిష్కారాలకు సహజమైన కేంద్రంగా మారుస్తున్నాయిభారతదేశంలో వైవిధ్యంజనాభా బలంప్రజాస్వామ్యం ఉన్నాయిభారత్ లో విజయవంతమయ్యే ఏ ఏఐ మోడల్ ను అయినా ప్రపంచవ్యాప్తంగా అమలు చేయవచ్చుఅందువల్లనేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నానుభారతదేశంలో రూపకల్పన చేయండిఅభివృద్ధి చేయండి. ( ప్రపంచానికి అందించండిమానవాళికి అందించండిమరోసారిమీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు

ధన్యవాదాలు!

 

***


(రిలీజ్ ఐడి: 2230391) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Assamese , Gujarati