ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

భారత్ అంతటా 110 కన్నా ఎక్కువ కృత్రిమ మేధ అంకుర సంస్థల్ని మ్యాప్ చేసిన కొత్త రిపాజిటరీ.. దీంతో జనాభా స్థాయిలో వాటి ప్రభావాన్ని తెలుసుకోవడం సులభతరం

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 9:07AM by PIB Hyderabad

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 లో ‘ఇండియాస్ ఏఐ ఇంపాక్ట్ స్టార్టప్స్’ నివేదికను ఆవిష్కరించారు. కృత్రిమ మేధను ఉపయోగించి జనాభా సామాజిక, ఆర్థిక స్థాయులపై ప్రభావాన్ని ప్రసరిస్తున్న 110 అంకుర సంస్థల, లాభాపేక్ష రహిత సంస్థల వివరాల్ని ఈ నివేదికలో పొందుపరిచారు.  ఇండియాఏఐ, కల్పా ఇంపాక్ట్‌లు ఈ రిపాజిటరీ (సమాచార నిధి)ని ప్రచురించాయి. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, వాతావరణం, అందరికీ ఆర్థిక సేవల అందజేత, పట్టణ ప్రాంతాల్లో మొబిలిటీ, సార్వజనిక సేవల లభ్యత సహా వివిధ రంగాల్ని లెక్కలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు.

 

image.png

 

భారత ‘ప్రభావశాలి ఏఐ’ అనుబంధ విస్తారిత వ్యవస్థకు చెందిన తొలి నిర్మాణ క్రమ మ్యాపింగే ఈ రిపాజిటరీ అని చెప్పాలి.  భారతీయ వ్యవస్థాపకులు ఎలాంటి సేవలను అభివృద్ధిపరుస్తున్నారో, అవి డిజైన్ పరంగా ఎలా స్థానికత ప్రధానంగా ఉంటూనే, సందర్భశుద్ధిలో ప్రపంచమంతటికీ ఉపయోగకరమో ఇది తెలియజేస్తోంది. మరింత లోతుగా విశ్లేషించిన మీదట, ఏక కాలంలో ప్రయోగాత్మకంగా ఉంటూనే పటిష్ఠీకరణకు కూడా దోహదం చేస్తున్న ఒక అనుబంధ విస్తారిత వ్యవస్థ రూపొందుతోందని తెలుసుకోవచ్చు. దీనిలో వాయిస్ ఏఐతో పాటు స్థానిక భాషా ఇంటర్‌ఫేసులు ఇంతకాలం ఆదరణకు నోచుకోకుండా దూరంగా ఉండిపోయిన వర్గాల వారి వద్దకు చేరుకోవడానికి అనువైన ప్రాథమిక సాధనాల్లా ఎదుగుతున్నాయని కూడా గ్రహించవచ్చు. అంతేకాదు, మేడ్ ఇన్ ఇండియా నమూనాలో అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని కూడా అర్థం అవుతుంది. ఏకీకరణకు సిద్ధంగా ఉన్న ఏఐ సామర్థ్యాల్ని అన్వేషిస్తున్న విధాన రూపకర్తలకు, సాంకేతిక పరిపక్వతతో పాటు విస్తరణకు అనువైన వ్యాపార సంస్థల కోసం వెదకుతున్న పెట్టుబడిదారులకు, అలాగే అభివృద్ధి కోసం తపిస్తున్న దేశాల నుంచి అనుకరించదగిన నమూనాల కోసం ఎదురుచూస్తున్న ఇతర అభివృద్ధి చెందే దశలోని దేశాలకూ ఒక రిఫరెన్సుగా కూడా ఈ రిపాజిటరీ పనికివస్తుంది.
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ (ఎంఈఐటీవై)లో అదనపు కార్యదర్శి, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్, ఇండియాఏఐ మిషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, ‘‘ ‘ఇండియాస్ ఏఐ ఇంపాక్ట్ స్టార్టప్స్: రిపాజిటరీ ఆఫ్  100 ప్లస్ స్టార్టప్స్ అండ్ నాన్-ప్రాఫిట్స్’ ఒక ఆచరణాత్మక వనరు. ఇది సార్వజనిక ఉద్దేశాలకనువైన కార్యక్రమాల సమగ్ర దృష్టికోణాన్ని ఆసక్తిదారులకు అందిస్తుంది. విధాన రూపకర్తలను దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుత డిజిటల్ సార్వజనిక మౌలిక సదుపాయాలతో ఏకీకరించడానికి సిద్ధంగా ఉన్న సామర్థ్యాల వివరాలనూ అందిస్తుంది. పరిశ్రమ వర్గాలు, పెట్టుబడిదారుల కోసం సాంకేతిక పరిపక్వత, విస్తరణయోగ్యత, దీర్ఘకాలిక సామర్థ్యం కలిగిన వాణిజ్య సంస్థల వివరాలను ఇది తెలియజేస్తుంది. మొత్తంమీద, విషయాలను తెలుసుకొని, అనుబంధాన్ని ఏర్పరుచుకొనేందుకు సాయపడే ఒక ఏకీకృత రిఫరెన్సుగా ఇది పనిచేస్తుంది’’ అన్నారు.
ఇండియాఏఐ మిషన్‌లో ఐఏఎస్ అధికారి శ్రీ మొహమ్మద్ వై. షరీఫుల్లా మాట్లాడుతూ, ‘‘భారత కృత్రిమ మేధ అనుబంధ విస్తారిత వ్యవస్థ వేగంగా పరిణతి చెందుతోంది, మరి ఈ సంకలనం వెలువడడం ఓ ముఖ్య ఘట్టమనే అనాలి.  భారతీయ అంకుర వ్యవస్థలు ఆశాన్విత పైలట్ ప్రాజెక్టుల దశ నుంచి ఎదుగుతూ  లక్షల మందికి సేవల్ని అందించే విస్తృత సాధనాలుగా పరిణతి చెందుతున్నాయి. ఈ అనుబంధ విస్తారిత వ్యవస్థను ప్రోత్సహించడానికి భారత ఏఐ మిషన్ కట్టుబడి ఉంది, అంతేకాకుండా ఆసక్తిదారులకు ఏయే రంగాల్లో ముందస్తుగా సకారాత్మక ప్రభావం పడుతోందో కూడా ఈ ప్రచురణ స్పష్టంగా వెల్లడిస్తోంది’’ అన్నారు.  
ఎంఈఐటీవైలో జనరల్ మేనేజరు శ్రీ అన్షుల్ సింఘల్ మాట్లాడుతూ, ‘‘ఈ రిపాజిటరీ ప్రత్యేకత ఏమిటంటే దీనిలో వివిధ రకాలైన సమస్యలకు పరిష్కారాల్ని సూచిస్తున్నారు.. వాటిలో న్యాయస్థాన కార్యకలాపాల లిఖితప్రతిని సిద్ధం చేయడం మొదలు గ్రామీణ ఆరోగ్య పరీక్షలతో పాటు చిన్న రైతులకు వ్యవసాయ సంబంధిత సలహాలు ఇవ్వడం వరకూ అనేక అంశాలు భాగంగా ఉన్నాయి. భారతీయ కృత్రిమ మేధ అంకుర సంస్థలు సేవలను రూపొందించడానికే పరిమితం కాకుండా, అభివృద్ధి తాలూకు ప్రయోజనాలను అన్ని వర్గాల వారి చెంతకు చేర్చడానికి కావలసిన మౌలిక సదుపాయాలను కూడా సిద్ధం చేస్తున్నాయి’’ అన్నారు.
కల్పా ఇంపాక్ట్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ సుశాంత్ కుమార్ మాట్లాడుతూ, ‘‘మనుషుల అవసరాలతో పాటు సార్వజనిక సేవల అందజేత ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి వాస్తవిక ప్రపంచంలో ఏఐని ఉపయోగించే ప్రక్రియలపైన భారత్‌లో కృత్రిమ మేధ అంకుర సంస్థల అనుబంధ విస్తారిత వ్యవస్థ తన దృష్టిని కేంద్రీకరించింది. మనం ‘సూపర్-యుటిలిటీ’ అని పిలుస్తోంది ఈ ప్రక్రియల్నే. మా విశ్లేషణలో, అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న కంపెనీల్లో అనేక కంపెనీలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో విస్తరణను పూర్తి చేసుకున్నాయని, దీంతో భారత్ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల కోసం ఏఐ ఎగుమతి కూడలి (ఎక్స్‌పోర్ట్ హబ్)గా నిలదొక్కుకొందనీ తేలింది. ఇంటర్‌నెట్ ఊతం లేకుండా పనిచేసే ఎడ్జ్ ఏఐ సేవలు మొదలు స్థానిక భాషలలో పనిచేసే వాయిస్ బాట్స్ వరకూ.. ఉపఖండంలో ప్రత్యేక సమస్యలకూ, ప్రపంచ దేశాలకు కూడా సందర్భశుద్ధిని కలిగి ఉండే సమస్యలకూ పరిష్కారాల్ని భారతీయ వ్యవస్థాపకులు అభివృద్ధి పరుస్తున్నారు’’ అన్నారు.
ఈ రిపాజిటరీకి అవసరమైన పరిశోధనకు సంబంధించిన పనుల్నీ, సంకలన బాధ్యతల్నీ కల్పా ఇంపాక్ట్ బృందం చేపట్టి పూర్తి చేసింది. ఈ రిపాజిటరీని   https://d19ob9sqegt2wc.cloudfront.net/stage/uploads/India_s_AI_Impact_Startups_Compendium_Report_Design_For_Web_4089ae98f7.pdf  లో చూడవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2230196) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil