ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ప్రధానమంత్రి మోదీతో క్రొయేషియా ప్రధాని భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 18 FEB 2026 5:41PM by PIB Hyderabad

క్రొయేషియా ప్రధానమంత్రి గౌరవ ఆండ్రేజ్ ప్లెంకోవిక్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ఐఎమ్ఈఈసీ కారిడార్ ద్వారా టెక్నాలజీ, ఆవిష్కరణ, నౌకా నిర్మాణం, బ్లూ ఎకానమీ, కనెక్టివిటీని మెరుగుపరచడం వంటి రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఊతమిచ్చే మార్గాలను ఇరువురు నేతలు చర్చించారు.

‘ఎక్స్’ వేదికగా చేసిన వేర్వేరు పోస్టులలో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

"క్రొయేషియా ప్రధానమంత్రి శ్రీ ఆండ్రేజ్ ప్లెంకోవిక్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయి. ఐఎమ్ఈఈసీ కారిడార్ ద్వారా టెక్నాలజీ, ఆవిష్కరణ, నౌకా నిర్మాణం, బ్లూ ఎకానమీ, కనెక్టివిటీని మెరుగుపరచడం వంటి రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఊతమిచ్చే మార్గాలను మేం చర్చించాం. భారత్‌తో పాటు ఐరోపాలోని ప్రజలకు అపూర్వ పురోగతిని అందించే భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యక్తిగతంగా మద్దతు తెలిపినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’.

 

***


(రిలీజ్ ఐడి: 2230021) సందర్శకుల సూచీ సంఖ్య : : 75