ఉప రాష్ట్రపతి సచివాలయం
భారతరత్న కర్పూరి ఠాకూర్ వర‌్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 11:01AM by PIB Hyderabad
భారతరత్న కర్పూరి ఠాకూర్ వర‌్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ నివాళులు అర్పించారు.
శ్రీ కర్పూరి ఠాకూర్ నిజమైన 'జన్ నాయక్' అని సోషల్ మీడియా పోస్టులో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. సామాజిక న్యాయం, బలహీనవర్గాల సాధికారతకు, ప్రజాసేవకే ఆయన జీవితం మొత్తాన్ని అంకితం చేశారని కొనియాడారు.
ఆయన నిరాడంబరత, సమగ్రత, అణగారిన వర్గాల అభివృద్ధికి ఆయన చూపించిన అంచెంచలమైన నిబద్ధత దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేస్తూనే ఉన్నాయని అన్నారు.
(రిలీజ్ ఐడి: 2229365)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4