ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫిబ్రవరి 16న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో- 2026'ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి


ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సుతో పాటు 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో- 2026'

కృత్రిమ మేధ విషయంలో ఆచరణాత్మక పనితీరును చాటిచెప్పే జాతీయ ప్రదర్శనగా నిలవనున్న ఎక్స్‌పో

300కు పైగా ప్రత్యేకంగా రూపొందించిన ప్రదర్శనశాలలు, ప్రత్యక్ష ప్రదర్శనలకు వేదికకానున్న ఎక్స్‌పో

'ప్రజలు, పృథ్వీ, ప్రగతి' అనే మూడు ప్రధాన చక్రీయ ఇతివృత్తాల ఆధారంగా జరగనున్న ఎక్స్‌పో

ఏఐ వ్యవస్థలో అంతర్జాతీయ సహకారాన్ని చాటిచెప్పేలా 600కు పైగా అధిక సామర్థ్యంగల అంకురాలు,

13 దేశాల ప్రత్యేక పెవిలియన్లకు వేదికకానున్న ఎక్స్‌పో

ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థలు, అంకురాలు, విద్యా - పరిశోధనా సంస్థలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురానున్న ఎక్స్‌పో

प्रविष्टि तिथि: 15 FEB 2026 2:21PM by PIB Hyderabad

2026 ఫిబ్రవరి 16న సాయంత్రం గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026'ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.

ఈ ఎక్స్‌పోను ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు భారత్ మండపంలో 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు'తో పాటుగా నిర్వహించనున్నారుప్రభుత్వ విధానాలతో ఆచరణనుఆవిష్కరణలతో విస్తృతినిసాంకేతికతతో సామాన్య పౌరుడిని ఒకచోట కలిసే ఈ వేదిక.. కృత్రిమ మేధ విషయంలో ఆచరణాత్మక పనితీరును చాటిచెప్పే జాతీయ ప్రదర్శనగా నిలుస్తుంది

70,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 10 ఏరినాల్లో విస్తరించి ఉన్న ఈ ఎక్స్‌పో.. అంతర్జాతీయ సాంకేతిక సంస్థలుఅంకురాలువిద్యా పరిశోధనా సంస్థలుకేంద్ర మంత్రిత్వ శాఖలురాష్ట్ర ప్రభుత్వాలుఅంతర్జాతీయ భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకొస్తుందిఏఐ వ్యవస్థలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రతిబింబించేలా 13 దేశాల పెవిలియన్లు ఈ ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయిఇందులో ఆస్ట్రేలియాజపాన్రష్యాబ్రిటన్ఫ్రాన్స్జర్మనీఇటలీనెదర్లాండ్స్స్విట్జర్లాండ్సెర్బియాఎస్టోనియాతజికిస్థాన్ఆఫ్రికా దేశాల ప్రదర్శనలు ఉంటాయి.

ఈ ఎక్స్‌పోలో 'ప్రజలుపృథ్వీప్రగతిఅనే మూడు ప్రధాన చక్రీయ ఇతివృత్త ఆధారంగా 300కు పైగా ప్రత్యేక ప్రదర్శనలుప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయిఇందులో 600కు పైగా అధిక సామర్థ్యం గల అంకురాలు పాల్గొంటున్నాయివీటిలో చాలా వరకు ప్రపంచస్థాయికి సరితూగేలాభారీ జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఏఐ పరిష్కారాలను రూపొందిస్తున్నాయిఇప్పటికే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితుల్లో అమల్లో ఉన్న తమ పనితీరును ప్రత్యక్షంగా ప్రదర్శిస్తాయి.

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026కు అంతర్జాతీయ ప్రతినిధులతో సహా 2.5 లక్షల మందికి పైగా సందర్శకులు వస్తారన్న అంచనా ఉందిఈ కార్యక్రమం అంతర్జాతీయ ఏఐ వ్యవస్థలో కొత్త భాగస్వామ్యాలను పెంపొందించడంసరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఐదు రోజుల వ్యవధిలో 500కు పైగా సెషన్లు నిర్వహించనున్నారుఇందులో 3,250 మందికి పైగా దార్శనికత కలిగిన వక్తలుప్యానెల్ సభ్యులు పాల్గొంటారువివిధ రంగాల్లో ఏఐ చూపుతున్న విప్లవాత్మక ప్రభావాన్ని గుర్తించడంప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఏఐ ప్రయోజనం చేకూరేలా భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించనున్నారు

 

***


(रिलीज़ आईडी: 2228477) आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam